News January 17, 2026

కోమా నుంచి కోలుకున్నా.. మార్టిన్ ఎమోషనల్ పోస్ట్

image

కోమా నుంచి కోలుకున్న AUS మాజీ క్రికెటర్ డామియన్ మార్టిన్ Xలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘DEC 27న నా జీవితం తలకిందులైంది. ఒక్క క్షణంలో లైఫ్ ఎలా మారిపోతుందో తెలిసింది. 8 రోజులు <<18765261>>కోమాలో<<>> ఉన్నా. బతికేందుకు 50-50 ఛాన్స్ ఉండగా కోమా నుంచి బయటపడ్డా. కానీ నడవలేకపోయా. ఇప్పుడు కోలుకున్నా. బీచ్‌లో నిల్చోగలిగా. సపోర్ట్ చేసిన వారికి థాంక్యూ’ అంటూ ఓ ఫొటో పోస్ట్ చేశారు.

Similar News

News February 21, 2026

రేపు దేవాదులకు సీఎం రేవంత్ రెడ్డి

image

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు, తుపాకులగూడెం సమ్మక్క- సాగర్ బ్యారేజ్‌ను ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. ప్రాజెక్టుల పురోగతి, నీటి నిల్వలు, సాగునీటి పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం పర్యటనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు భారీగా హాజరుకానున్నారు.

News February 21, 2026

పోలీసులతో కలిసి పనిచేస్తారా? ఇది మీకోసమే!

image

TG: హైదరాబాద్ సిటీ పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. డిగ్రీ, పీజీ చదువుతున్న 25ఏళ్లలోపు విద్యార్థుల కోసం ఇంటర్న్‌షిప్, ప్రొఫెషనల్ వాలంటీర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. ఎంపికైన వారు ఆధునిక పోలీసింగ్, డేటా అనాలసిస్, రీసెర్చ్ ప్రాజెక్టుల్లో పోలీసులకు సహకరిస్తారు. యువతలోని నైపుణ్యాలను ఉపయోగించుకుంటూ వారికి పాలనా వ్యవస్థపై అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. HYD పోలీస్ <>సైట్‌లో<<>> అప్లై చేసుకోండి.

News February 21, 2026

నక్సల్స్ మాదిరిగానే చొరబాటుదారులను ఏరివేస్తాం: అమిత్ షా

image

అక్రమ వలసదారులను ఓటర్ల జాబితా నుంచే కాకుండా దేశం నుంచి కూడా తొలగిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. నక్సల్స్ మాదిరిగానే చొరబాటుదారులనూ మరో ఐదేళ్లలో ఏరివేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అస్సాంలోని కామ్‌రూప్‌లో ఆయన మాట్లాడారు. ‘అక్రమ వలసదారులను బహిష్కరిస్తామని రాహుల్ చెప్పారు. కానీ ఆ పని చేయరు. ఎందుకంటే వారే ఆ పార్టీకి ఓటు బ్యాంక్. INC విధానాలు అస్సాంకు ముప్పుగా మారాయి’ అని ఆరోపించారు.