News December 19, 2025

కోరంగి వద్ద ఎదురెదురుగా బైకులు ఢీ.. ఒకరి మృతి

image

తాళ్లరేవు జాతీయ రహదారి 216పై కోరంగి వంతెన సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. రెండు బైకులు ఎదురెదురుగా బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఒకరు ఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కోరంగి పోలీసులు క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఎస్సై సత్యనారాయణ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 19, 2025

విజయనగరం ఎస్పీ దామోదర్‌కు అవార్డు

image

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రకాశం జిల్లా మాజీ MPP వీరయ్య చౌదరి హత్య కేసును సమర్థవంతంగా ఛేదించినందుకు విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ (అప్పటి ప్రకాశం జిల్లా ఎస్పీ) ABCD – Award for Best in Crime Detection అవార్డు అందుకున్నారు. రాష్ట్ర DGP కార్యాలయంలో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా శుక్రవారం ఈ అవార్డు ప్రదానం చేశారు. ఈ కేసులో 60 క్రైమ్ టీములు ఏర్పాటు చేసిన ఎస్పీ 9 మందిని అదుపులోకి తీసుకున్నారు.

News December 19, 2025

కామారెడ్డి: అప్రమత్తతతో ప్రాణ నష్ట నివారణ

image

అప్రమత్తతతో విపత్తుల సమయంలో ప్రాణ నష్ట నివారణ చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు సూచించారు. శుక్రవారం ప్రకృతి విపత్తుల నిర్వహణకు సంబంధించి వైపరీత్యాల నివారణ నిర్వహణ చర్యలపై జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ అధికారులతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.

News December 19, 2025

ఏలూరు: టెట్ పరీక్షకు 38 మంది గైర్హాజరు

image

ఏలూరు జిల్లాలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) శుక్రవారం ప్రశాంతంగా ముగిసిందని డీఈఓ వెంకట లక్ష్మమ్మ తెలిపారు. ఉదయం సెషన్‌కు 175 మందికి గానూ 148 మంది (27 మంది గైర్హాజరు), మధ్యాహ్నం సెషన్‌కు 175 మందికి గానూ 164 మంది హాజరు, (11 మంది గైర్హాజరు) అయినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా పరీక్షలు ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా, మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాకుండా పకడ్బందీగా నిర్వహించామని ఆమె స్పష్టం చేశారు.