News February 11, 2025
కోరికల కొండ గురించి తెలుసా?

శ్రీశైలం పాదయాత్రలో పెద్ద చెరువు దాటిన తర్వాత కోరికల కొండ వస్తుంది. ఈ కొండ మీద మన కోరిక చెప్పుకుంటే తీరుతుందని భక్తుల నమ్మకం. పెళ్లి కావాలనుకునే వారు అక్కడ చిన్న పందిరి వేస్తారట. సంతానం కోరుకొనే వారు ఉయ్యాల కడతారు. సొంతిల్లు కావాలనుకునే వారు ఒక రాయి మీద ఇంకో రాయి పేరుస్తారు. కొంత మంది తమ కోరికలు ఆ కొండ మీద మట్టిలో చేతితో రాస్తారట. మరి మీరు శ్రీశైలానికి పాదయత్రగా వెళ్లారా?
Similar News
News October 2, 2025
ఈ విషాదానికి 16 ఏళ్లు

2009 అక్టోబర్ 2న తుంగభద్ర, హంద్రీ నదుల ఉద్ధృతితో అతలాకుతలం చేసిన వరద కర్నూలు నగరాన్ని ముంచెత్తింది. ఇళ్లూ, ఆస్తులు, జ్ఞాపకాలు నీటిలో కొట్టుకుపోయాయి. అనేక కుటుంబాలు రోడ్లను ఆశ్రయించగా, వేలాది మంది తమ బంధువులను, జీవనాధారాలను కోల్పోయారు. నేటికి 16 ఏళ్లు గడిచినా ఆ భయం, బాధలు మిగిలే ఉన్నాయి. ఆ కష్టకాలాన్ని గుర్తుచేసుకుంటూ నగర ప్రజలు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
News October 2, 2025
ఈనెల 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ: జేసీ

ఈనెల 15న రేషన్ షాప్ డీలర్ల వద్ద స్మార్ట్ రేషన్ కార్డులు పొందవచ్చని జేసీ డా.బి.నవ్య వెల్లడించారు. 16వ తేదీ నుంచి సచివాలయ ఉద్యోగులు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తారన్నారు. బుధవారం కర్నూలులోని బుధవార పేటలో ఎఫ్‌సీ షాపులను తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డులు ఉచితంగా పంపిణీ చేయాలన్నారు. ఎవరైనా రేషన్ డీలర్లు డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News October 2, 2025
ప్రధాని పర్యటన నేపథ్యంలో పగడ్బందీగా ఏర్పాట్లు చేయండి: కలెక్టర్

ఈ నెల 16న ప్రధాని జిల్లాలో పర్యటించనున్నట్లు ప్రాథమికంగా సమాచారం అందిన నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ సిరి ఆదేశించారు. బుధవారం కర్నూలు కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. పర్యటనకు సంబంధించి ఇంకా అధికారికంగా షెడ్యూల్ విడుదల కాలేదన్నారు. నగరంలో 4,000 మందితో రోడ్ షో ఉండే అవకాశం ఉందన్నారు.