News April 14, 2025

కోరుకొండ కొండపై నుంచి రోప్‌వేకి కేంద్రం గ్రీన్ సిగ్నల్

image

కేంద్ర ప్రభుత్వం ఏపీలో ఐదు ప్రాంతాల్లో రోప్‌వేలకు అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేసే వాటిలో కోరుకొండలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉన్నట్లు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయం ముందు నుంచి శిఖరాగ్రం వరకూ 0.25 కిలోమీటర్లు రోప్‌వే ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు. కేంద్రం నుంచి అనుమతి రావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News April 15, 2025

కోరుకొండలో రోప్‌వే.. ఫలించిన ఎమ్మెల్యే కృషి

image

కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కింద నుంచి కొండపై వరకు 0.25 కిలోమీటర్ల మేర రోప్‌వే చేయాలని ఎమ్మెల్యే ప్రతిపాదనను కేంద్రం అంగీకరించింది. ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్, అన్నవరం దేవస్థానం వారి సమగ్ర ప్రణాళికతో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను ఎంపీకి నేరుగా అందించడం వల్ల నలుగురు మంత్రులు ఆమోదించి 36 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

News April 15, 2025

డ్రోన్‌లతో ప్రత్యేక నిఘా: జిల్లా ఎస్పీ

image

తూ.గో.జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు డ్రోన్‌లతో ప్రత్యేక నిఘాను పటిష్ఠం చేసినట్లు ఎస్పీ నరసింహ కిశోర్ తెలిపారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని నిర్మానుష్యమైన ప్రదేశాల్లో బహిరంగంగా మద్యం, గంజాయి తాగడం, పేకాట, చైన్ స్నాచింగ్ తదితర నేరాలపై డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టినట్లు చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

News April 15, 2025

RJY: మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా సత్యనారాయణ

image

తూ.గో జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా కే.వీ. సత్యనారాయణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 991 బ్యాచ్‌కు చెందిన ఆయిన ఉమ్మడి తూ.గో జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో సీఐ గా, కాకినాడ ట్రాఫిక్ డీఎస్పీగా, రాజమండ్రి  అడిషనల్ డీఎస్పీగా, ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా, పరవాడ సబ్ డివిజన్ పోలీస్ అధికారిగా విధులు నిర్వర్తించారు. ఎపీ పోలీస్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తు, బదిలీపై ఇక్కడికి వచ్చారు.

error: Content is protected !!