News December 31, 2024

కోరుకొండ: రేవ్ పార్టీలో 19 మంది అరెస్ట్.. వివరాలివే

image

తూ.గో(D) కోరుకోండలోని రేవ్ పార్టీపై పోలీసుల దాడిలో మొత్తం 19మందిని అరెస్ట్ చేశారు. గుంటూరుకి చెందిన గోపాలకృష్ణ అనే వ్యక్తి ఫంక్షన్ హాల్ బుక్ చేసి పార్టీ నిర్వహించారు. ఇక్కడికి TNK, ఆచంట, గోపాలపురానికి చెందిన 10మంది ఎరువుల డీలర్లను రప్పించారు. కాకినాడకు చెందిన మహిళ ద్వారా ఐదుగురు అమ్మాయిలను తీసుకొచ్చారు. వారితో మద్యం తాగుతూ డ్యాన్స్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి నిందితుల్ని కోర్టులో హాజరుపర్చారు.

Similar News

News January 3, 2025

APలో ఆరోగ్యశ్రీ ఎక్కడికీ పోలేదు: మంత్రి

image

APలో ఆరోగ్యశ్రీ ఎక్కడికీ పోలేదని.. ఎన్టీఆర్‌ వైద్య సేవ పేరుతో మరింత మైరుగైన సేవలు అందించేలా రూపాంతరం చెందినట్లు మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏప్రిల్ 01 నుంచి నగదు రహిత చికిత్సల్లో హైబ్రిడ్ విధానం అమలవుతుందన్నారు. రూ.2.5 లక్షల నుంచి రూ.25 లక్షల వైద్య సేవల ఖర్చును NTR వైద్య సేవ ట్రస్ట్‌ భరిస్తుందన్నారు.

News January 3, 2025

గుంటూరు: 106 మంది పాస్

image

గుంటూరులోని పోలీస్ పరేడ్ మైదానంలో కానిస్టేబుల్ మహిళా అభ్యర్థులకు శుక్రవారం పరుగు పోటీలను నిర్వహించారు. పరీక్షలకు 216 మంది మహిళా అభ్యర్థులు వచ్చారు. దేహధారుడ్య, పరుగు పోటీల్లో 106 మంది క్వాలిఫై అయినట్లు అధికారులకు తెలిపారు. పరుగు పోటీల నిర్వహణను ఎస్పీ సతీశ్ కుమార్ పరిశీలించారు. ఏఎస్పీలు సుప్రజ, హనుమంతు పాల్గొన్నారు.

News January 3, 2025

మంగళగిరి: డ్రోన్లతో సరికొత్త సేవలు

image

మంగళగిరిలో డ్రోన్లతో సరికొత్త సేవలకు శ్రీకారం చుట్టారు. UPHC ఇందిరా నగర్ నుంచి AIIMS మంగళగిరికి గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం PAP స్మెర్ నమూనాలను డ్రోన్ సహాయంతో 2నిమిషాల్లో పంపించారు. వైద్య రంగంలో ఏపీ మరో మైలురాయిని అధిగమించిందని APMSIDC ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. డ్రోన్ సేవల పైలట్ ప్రాజెక్ట్‌ను ఆయన ప్రారంభించారు. AIIMS సిబ్బందిని, అధికారులను అభినందించారు.