News July 5, 2025

కోరుట్ల: కత్తిపోట్ల ఘటన.. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

జగిత్యాల జిల్లా కోరుట్ల రవీంద్రరోడ్‌కు చెందిన ఇర్యాల సత్యనారాయణ(49)పై ఇటీవల అదే కాలనీకి చెందిన గంగనర్సయ్య పాత కక్షల కారణంగా <<16876293>>కత్తితో దాడి<<>> చేశాడు. ఆ దాడిలో గాయపడిన సత్యనారాయణను కరీంనగర్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఈ క్రమంలోనే ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మరణించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News July 5, 2025

NLG: వన మహోత్సవానికి సిద్ధం

image

ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవం కార్యక్రమానికి జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ ఏడాది పెద్దఎత్తున మొక్కలు నాటేలా ప్రణాళిక తయారు చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే లక్ష్యంతో నర్సరీలు, మొక్కలు నాటే ప్లాంటేషన్ సైట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది 68.70 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

News July 5, 2025

సంగారెడ్డి: హెక్టార్‌లో 2 టన్నుల కంది దిగుబడి

image

గరిష్ట ఉష్ణోగ్రతలు తట్టుకొని, ఒక హెక్టార్‌లో 2 టన్నులు దిగుబడి ఇచ్చే కంది వంగడాన్ని ICPV 25444 పేరుతో ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. 45 డిగ్రీల సెల్సియ ఉష్ణోగ్రతల వద్ద సైతం ఇది తట్టుకుంటుంది. 125 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఖరీఫ్ రబీ సీజన్‌లో ఎప్పుడైనా పంట పండించవచ్చు. తాండూరు, వికారాబాద్, సంగారెడ్డి ప్రాంతాలు ఈ పంట రకానికి అనుకూలమని అధికారులు డైరెక్టర్ హిమాన్షు తెలిపారు.

News July 5, 2025

ఒంటరితనం.. ఒకరికొకరు పలకరించుకుంటే మేలు!

image

బంధాలు, బంధుత్వాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు కుటుంబాల్లో, స్నేహితుల్లో ప్రేమానురాగాలు ఉండేవి. ప్రస్తుతం సంపాదనలో పడి ఒకరి గురించి మరొకరు ఆలోచించడమే మానేశారు. దీంతో ఎంతో మంది ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. దీని వల్ల ప్రతి గంటకు వంద మంది చనిపోతున్నట్లు WHO చెబుతోంది. ఇండియాలో యువత సామాజిక సంబంధాలకు దూరంగా స్క్రీన్‌కు దగ్గరగా ఉంటూ మానసిక, శారీరక సమస్యలు తెచ్చుకుంటోందని పేర్కొంది.