News February 3, 2025
కోరుట్ల: ధర్మశాల భూమి పూజలో ఎమ్మెల్యే
కోరుట్ల పట్టణంలోని శ్రీ మహాదేవ స్వామివారి ఆలయంలో నూతనంగా నిర్మించబోయే శ్రీ నందీశ్వర ధర్మశాల (కల్యాణ మండపం) భూమిపూజ కార్యక్రమంలో సోమవారం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ఆయన వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.
Similar News
News February 3, 2025
KMR: ఎన్నికల నిబంధనలు పాటించాలి: కలెక్టర్
MLC ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సోమవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు.
News February 3, 2025
సిద్దిపేట: ప్రోమో ఆవిష్కరించిన DMHO
ప్రాచీన ఆరోగ్య విధానాలు, యోగాను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రపంచాన్ని నిర్మించవచ్చని సిద్దిపేట జిల్లా వైద్య& ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పల్వాన్ కుమార్ అన్నారు. సోమవారం శత సహస్ర సూర్య నమస్కార ప్రదర్శన, రాష్ట్రస్థాయి పోటీలకు సంబంధించి ప్రోమో ఆవిష్కరించారు భారతీయ ఆరోగ్య విధానాలు ప్రపంచానికి మార్గదర్శకమన్నారు.
News February 3, 2025
HYD: అనుమతి నిరాకరించడంపై మందకృష్ణ ఫైర్
లక్ష డప్పులు.. వేయి గొంతులు కార్యక్రమానికి అనుమతి నిరాకరించడాన్ని ఖండిస్తున్నామని మందకృష్ణ మాదిగ అన్నారు. సోమాజిగూడలో ఆయన మాట్లాడుతూ.. సీఎం, డీజీపీ HYD సిటీ సీపీ పునరాలోచించాలని, పునఃసమీక్ష చేసి అనుమతిని మంజూరు చేయాలన్నారు. MRPS ఏ రోజూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పని చేయలేదని, మాదిగ పల్లెలో కనుమరుగవుతున్న డప్పులు మళ్లీ పునరుజ్జీవం పోసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.