News December 24, 2025
కోరుట్ల: భార్యాభర్తల పై దురుసుగా ప్రవర్తించిన నలుగురిపై కేసు

కోరుట్ల పట్టణ శివారులోని పెద్ద గుండు దగ్గర గ్రౌండ్ లో మంగళవారం మద్యం సేవించి తాగిన మత్తులో భార్యాభర్తల పై దురుసుగా ప్రవర్తించిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అడ్డుగా వచ్చిన భర్త పైన దాడి చేసిన సంఘటనలో బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురు వ్యక్తుల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Similar News
News December 28, 2025
చిట్యాల: రేపటి నుంచి నాపాక బ్రహ్మోత్సవాలు

చిట్యాల మండలం నైనుపాక గ్రామ నాపాక ఆలయ శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 29, 30, 31న మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని ఏటా ఆలయం నందు జాతర నిర్వహించి ఎడ్ల బండ్లు, కోలాట బృందాల నృత్య ప్రదర్శనలు, విగ్రహాల ఊరేగింపు వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. కాగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై జాతరను విజయవంతం చేయాలని కోరుతున్నారు.
News December 28, 2025
కేటిదొడ్డి: వైకుంఠ ఏకాదశి పర్వదినానికి వేళాయే..!

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈనెల 30వ తేదీన (మంగళవారం) మండలంలోని వెంకటాపురం గ్రామంలో వెలసిన శ్రీ పాగుంట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. స్వామివారి దర్శనం తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి సేవల్లో పాలుపంచుకోవాలని ఆలయ అర్చకులు కోరారు.
News December 28, 2025
సొంత పార్టీలో ‘దిగ్విజయ్’ చిచ్చు!

దిగ్విజయ్ సింగ్ చేసిన RSS అనుకూల <<18686086>>వ్యాఖ్యలపై<<>> సొంత పార్టీ కాంగ్రెస్‌లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యర్థుల బలాన్ని విశ్లేషించడం తప్పు కాదంటూ కొందరు ఆయనకు మద్దతుగా నిలిస్తే.. ‘గాడ్సే’ని నమ్మేవాళ్ల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. కార్యకర్త PM అవ్వడం BJPలోనే సాధ్యమని దిగ్విజయ్ నిన్న పోస్ట్ చేశారు.


