News January 7, 2026
కోరుట్ల: వెంకటేశ్వర స్వామికి 108 రకాల నైవేద్యాలు

కోరుట్ల పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా బుధవారం స్వామివారికి 108 రకాల ప్రసాదాలతో నైవేద్యాలు సమర్పించారు. ఆలయ అర్చకులు అభిషేకం తదితర ప్రత్యేక పూజలను నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 22, 2026
కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్!

TG: రాష్ట్రంలో విచిత్ర వాతావరణం నెలకొంది. కొన్ని జిల్లాల్లో ఎండలు మండిపోతుండగా మరికొన్ని జిల్లాల్లో వర్షాలకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాబోయే 3-4 గంటల్లో ఆసిఫాబాద్, మహబూబాబాద్, వికారాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి, భద్రాద్రి జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. మిగిలిన జిల్లాల్లో రాత్రివేళ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు.
News February 22, 2026
నాగర్ కర్నూల్ జిల్లా.. ఇంటర్ పరీక్షలకు వేళాయె!

నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ నెల 25 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ తెలిపారు.
✒ఇంటర్మీడియట్ విద్యార్థుల సంఖ్య: 15,173
✒ మొత్తం పరీక్ష కేంద్రాలు: 34
✒ఇన్విజిలేటర్లు: 300
✒అన్ని కేంద్రాల్లో CC కెమెరాల నిఘా
✒హాల్ టికెట్లలో QR కోడ్ స్కాన్ చేస్తే ఎగ్జామ్ సెంటర్ వివరాలు వస్తాయి
✒సిట్టింగ్ స్క్వాడ్లు: 3
✒చీఫ్ సూపరింటెండెంట్స్- 34
✒కస్టోడియన్స్- 6
✒మెడికల్ ANMలు- 34
News February 22, 2026
పెద్దవాళ్ల సబ్బునే పిల్లలకూ వాడుతున్నారా?

చిన్నపిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అందుకే వారికి ఉపయోగించే ఉత్పత్తుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. చాలామంది పిల్లలకు తర్వాత పెద్దవాళ్ల సబ్బులే వాడుతుంటారు. కానీ ఇది సరికాదంటున్నారు నిపుణులు. దీనివల్ల వారికి చిరాకు, అలర్జీ వచ్చే అవకాశముందంటున్నారు. పిల్లల ఉత్పత్తుల్లో పారబెన్స్, మినరల్ ఆయిల్స్, సల్ఫేట్స్ లేకుండా pH5.5% ఉండేలా చూసుకోవాలంటున్నారు.


