News August 12, 2024
కోరుట్ల: స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని సీఎంకు పోస్ట్ కార్డులు

స్కాలర్షిప్‌లు విడుదల చేయాలని కోరుట్ల డిగ్రీ కళాశాల విద్యార్థులు సీఎంకు పోస్ట్ కార్డు ద్వారా విన్నవించారు. మూడేళ్లుగా స్కాలర్‌షిప్‌లు రాకపోవడం వల్ల పరీక్ష ఫీజులు చెల్లించడానికి, పుస్తకాలు కొనుక్కోవడానికి ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. బస్ పాసుల కోసం డబ్బులు లేక కళాశాలకు రెగ్యులర్‌గా రాలేక చాలా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా స్కాలర్‌షిప్‌ను విడుదల చేయాలని కోరారు.
Similar News
News February 10, 2026
కరీంనగర్: పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది పయనం

కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. నగరంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల పంపిణీ కేంద్రం నుంచి ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ సామాగ్రితో ఆయా కేంద్రాలకు బయలుదేరి వెళ్లారు. బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రిని తీసుకున్న సిబ్బంది ప్రత్యేక వాహనాల్లో పోలీసు బందోబస్తు మధ్య తరలివెళ్లారు. దీంతో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సందడి నెలకొంది.
News February 10, 2026
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి: కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలోని పంపిణీ కేంద్రాన్ని సందర్శించిన ఆమె ఏర్పాట్లను పరిశీలించారు. సిబ్బంది చెక్‌లిస్ట్ ప్రకారం సామగ్రిని తనిఖీ చేసుకోవాలని, నిబంధనలు పాటిస్తూ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.
News February 10, 2026
కరీంనగర్‌లో త్రిముఖ పోరు. మేయర్ పీఠం ఎవరిదో?

కాంగ్రెస్, BJP, BRS.. KNR కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో త్రిముఖ పోటీ నెలకొంది. 66 వార్డులు గల నగరంలో పాగా వేసేందుకు ఇప్పటికే బండి సంజయ్, పొన్నం, గంగుల వంటి కీలక నేతలు సహా స్థానిక నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఎంఐఎం కూడా ప్రభావం చూపే ఇక్కడ మెజారిటీ ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని పక్షంలో పొత్తులు కుదిరే అవకాశం ఉందనే ప్రచారమూ జరుగుతోంది.


