News December 21, 2025

కోర్టు తీర్పులను విస్మరిస్తోన్న ప్రభుత్వం: షియా ముస్లిం కౌన్సిల్

image

సుప్రీం, హైకోర్టుల స్పష్టమైన తీర్పులున్నా షియా ముస్లింల హక్కులను ప్రభుత్వం విస్మరిస్తోందని ఆ కౌన్సిల్ మండిపడింది. గవర్నర్ కోటా(సామాజిక సేవ)లో MLC పదవితో పాటు అవసరమైన సౌకర్యాలు వెంటనే కల్పించాలని డిమాండ్ చేసింది. లక్డీకాపూల్‌లో జరిగిన సమావేశంలో SC మే 26, హైకోర్టు DEC 11 తీర్పులను ప్రస్తావిస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టింది. కోర్టు ఆదేశాలు అమలు చేయకపోతే ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించింది.

Similar News

News December 22, 2025

నేడు నెక్లెస్ రోడ్డులో ‘మాక్ డ్రిల్’

image

ప్రకృతి విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేలా సోమవారం నెక్లెస్ రోడ్ వ్యూ ప్రాంతంలో ‘మాక్ ఎక్సర్సైజ్’ నిర్వహించనున్నట్లు హైదరాబాద్ డీఆర్ఓ వెంకటాచారి తెలిపారు. ఆదివారం కలెక్టరేట్‌లో అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, హైడ్రా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. విపత్తు వేళ వివిధ శాఖలు సమన్వయంతో ఎలా స్పందించాలనే అంశంపై ఈ విన్యాసాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

News December 22, 2025

యోగాతో ఒత్తిడి, మానసిక సమస్యలకు చెక్

image

యోగాతో మానసిక సమస్యలు దూరం చేసుకోవచ్చు. ఉదయాన్నే చేసే యోగా మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. చిన్న చిన్న ఎక్సర్‌సైజులు చేస్తే లంగ్స్ హెల్తీగా ఉంటాయి. యోగా చేస్తే ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ అదుపులో ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కోపం, ఆందోళన కంట్రోల్ అవుతాయి. ప్రశాంతంగా ఆలోచించే గుణం పెరుగుతుంది. చిన్న వయసు నుంచే యోగా నేర్పిస్తే పిల్లలకు ఆరోగ్యంతోపాటు ఏకాగ్రత కూడా పెరుగుతుంది.

News December 22, 2025

నాపై 109 కేసులున్నాయి కాబట్టే..: సంజయ్

image

ప్రజల కోసం చేసిన పోరాటాల వల్ల తనపై 109 కేసులు పెట్టారని కేంద్రమంత్రి బండి సంజయ్ ఓ మెడికల్ కాలేజీ వార్షికోత్సవంలో తెలిపారు. ఈ విషయం తెలిసిన చంద్రబాబు ఇన్ని కేసులున్నాయా? అని అమిత్ షాను అడిగారని గుర్తు చేశారు. ‘అందుకే సంజయ్ కేంద్ర హోంశాఖకు సహాయ మంత్రి అయ్యారు’ అని షా బదులిచ్చారని పేర్కొన్నారు. వైద్యులు ఫార్మా కంపెనీలు, డయాగ్నోస్టిక్ సెంటర్ల వలలో పడి ప్రజలకు అన్యాయం చేయొద్దని కోరారు.