News April 12, 2025
‘కోర్టు తీర్పు ప్రకారం ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టాలి’

హైకోర్టు తీర్పు ప్రకారం పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో మత్స్యకారులకు ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర మత్స్యకార సంఘం ప్రతినిధి చింతకాయల ముత్యాలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పరవాడ ఎమ్మార్వో అంబేడ్కర్‌కు శుక్రవారం మత్స్యకార నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం ముత్యాలమ్మపాలెంకు చెందిన 500 మంది మత్స్యకారులకు 15 రోజుల్లో ఉపాధి కల్పించాలన్నారు.
Similar News
News December 24, 2025
జగిత్యాల: ‘వ్యవసాయ విద్యార్థులు కృషి చేయాలి’

వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చి అధిక పంట దిగుబడులకు వ్యవసాయ విద్యార్థులు పూర్తి స్థాయిలో కృషి చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జగిత్యాల మండలం పొలాసలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విద్యాలయంలో విద్యార్థులతో నిర్వహించిన ఇంటరాక్షన్ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, వీసీ జానయ్య ఉన్నారు.
News December 24, 2025
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో 3వ విడత VRSకి నోటిఫికేషన్

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో 3వ విడత VRS పథకాన్ని యాజమాన్యం బుధవారం ప్రకటించింది. 2027 జనవరి 1వ తేదీ తర్వాత పదవీ విరమణకు అర్హులయ్యే ఉద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది. 2026 జనవరి 1-20 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో మాత్రమే స్వీకరించనున్నట్లు స్పష్టం చేసింది. కనీసం 15 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి, 45 ఏళ్లు దాటిన ఉద్యోగులు అర్హులు.
News December 24, 2025
సీపీఐ శతవసంతాల ముగింపు సభను విజయవంతం చేయండి: చాడ

భారత కమ్యూనిస్టు పార్టీ శతవసంతాల ఉత్సవాలలో బాగంగా జనవరి 18న ఖమ్మం పట్టణంలో నిర్వహించే ముగింపు సభను విజయవంతం చేయాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో బుధవారం విలేకర్లతో మాట్లాడారు. గడిచిన వందేళ్లలో పేదల పక్షాన నిలబడి ఎన్నో ప్రజా పోరాటాలు నిర్వహించిన కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుందన్నారు.


