News September 21, 2025
కోలలపూడి వద్ద ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి

మార్టూరు (M) కోలలపూడి జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుక్కను తప్పించబోయి కారు డివైడర్‌ను ఢీకొంది. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. తిరుపతి నుంచి పిఠాపురంలోని దేవాలయానికి పిత్రుదేవతలకు పిండప్రధానం చేయడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు లక్ష్మణ్ (70), సుబ్బాయమ్మ (65) , హేమంత్ (25) గా సమాచారం. మరో ఇద్దరు గాయపడ్డారు.
Similar News
News September 21, 2025
ఫార్మసీ, ఎంఎస్సీ ఫలితాలు విడుదల

అనంతపురం JNTU పరిధిలోని బీఫార్మసీ, ఫార్మాడీ, ఎంఎస్సీ కోర్సుల పరీక్షా ఫలితాలు శనివారం రాత్రి విడుదలయ్యాయి. బీఫార్మసీ 2వ సంవత్సరం 1వ, 2వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ, ఫార్మాడీ 2వ, 5వ సంవత్సరం, ఎంఎస్సీ 1వ, 2వ సెమిస్టర్ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల కోసం కాలేజీ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.
News September 21, 2025
NLG: మైనార్టీల సంక్షేమ పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం

మైనార్టీల ఆర్థిక సహాయం కోసం ప్రవేశపెట్టిన ‘రేవంత్ అన్నకా సహారా మిస్కీనో కే లియే’, ‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన’ పథకాలకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి విజయేందర్ రెడ్డి తెలిపారు. అర్హులు https://tgobmms. cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
News September 21, 2025
NZB: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

వర్నిలోని ఫంక్షన్ హాల్ వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. రుద్రూర్ మండలం అక్బర్ నగర్‌కు చెందిన అజార్(25) అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అజార్‌ను ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను తీవ్ర గాయాలపాలై ఘటనా స్థలంలో మృతి చెందాడు. పోలీసు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.