News July 5, 2024
కోల్డ్ స్టోరేజీలలో పేరుకుపోతున్న నిల్వలు

ఖమ్మం జిల్లాలో 42 కోల్డ్ స్టోరేజీలు ఉండగా, సుమారు 45 లక్షల వరకు మిర్చి బస్తాలను నిల్వ చేసే సామర్థ్యం ఉంది. గత ఏడాది వానాకాలం సీజన్లో జిల్లావ్యాప్తంగా 92,273 ఎకరాల్లో మిర్చి సాగు చేసిన రైతులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేశారు. మధిరలోని 13కోల్డ్ స్టోరేజీల్లో సుమారు 12లక్షల బస్తాలు నిల్వ చేసినట్లు అంచనా. కనీసం రెండు లక్షల బస్తాలను కూడా విక్రయించకపోవడంతో 10 లక్షలకు పైగా బస్తాలు నిల్వ ఉన్నాయి.
Similar News
News February 28, 2026
రేపు ఖమ్మంకు నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యుడి రాక

నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ ఆదివారం ఖమ్మంలో పర్యటించనున్నట్లు జిల్లా బీజేపీ నాయకుడు జాటోత్ మధునాయక్ తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా సా.3 గంటలకు ఎస్టీ కమిషన్ సభ్యుడు వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులను పరామర్శిస్తారని చెప్పారు. అనంతరం భూదాన్ భూముల్లో కూల్చివేసిన ఇళ్లను పరిశీలిస్తారని అన్నారు. ఈ విషయాన్ని అధికారులు, ప్రజలు గమనించాలని పేర్కొన్నారు.
News February 28, 2026
ఖమ్మం: ముఖ్యమంత్రి గారూ మీ హృదయం ఎందుకు కరగదు?

ఖమ్మం భూదాన్ ఘటనలో ఓ ఎస్‌ఐ కూడా బాధితుల పరిస్థితి చూసి కంటతడి పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని MLC తీన్మార్ మల్లన్న గుర్తు చేశారు. పోలీసులే కరిగిపోయారు, మరి ముఖ్యమంత్రి గారూ మీ హృదయం ఎందుకు కరగదు? అని ప్రశ్నించారు. బీసీలపై వివక్ష కొనసాగితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ‘రేపు అసెంబ్లీలో ఇదే అంశంపై గళమెత్తుతాను. ఎవరు అడ్డుకుంటారో చూస్తాను’ అంటూ సవాల్ విసిరారు.
News February 28, 2026
ఖమ్మం: బీసీ భూముల మీద కక్ష సాధింపు ఎందుకు: తీన్మార్ మల్లన్న

రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో మొత్తం 65 వేల ఎకరాల భూదాన్ భూములు అగ్రవర్ణాల ఖబ్జాలో ఉన్నప్పుడు, పేద బీసీ కుటుంబాల 62 ఎకరాల భూముల మీద కక్ష సాధింపు చర్యలు ఎందుకని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన బాధితులతో ముఖాముఖిగా సమావేశమైన మల్లన్న ప్రభుత్వంపై అగ్గి రవ్వలు రువ్వారు.


