News January 31, 2026

కోళ్లలో కొరైజా రోగ లక్షణాలు- జాగ్రత్తలు

image

కొరైజా రోగం సోకిన కోళ్లు సరిగా నీటిని, మేతను తీసికోక బరువు తగ్గుతాయి. కోడి ముక్కు, కళ్ల నుంచి నీరు కారుతుంది. కళ్లలో ఉబ్బి తెల్లని చీము గడ్డలు ఏర్పడతాయి. ఒకసారి ఈ వ్యాధి క్రిములు షెడ్డులోనికి ప్రవేశిస్తే అన్ని బ్యాచ్‌లకు ఈ రోగం వచ్చే ఛాన్సుంది. ఒక బ్యాచ్‌కు ఈ వ్యాధి వస్తే ఆ షెడ్డును కొన్ని రోజులు ఖాళీగా ఉంచాలి. సున్నం, గమాక్సిన్, బ్లీచింగ్ పౌడర్ కలిపి సున్నం వేయాలి. లిట్టరు పొడిగా ఉండేలా చూడాలి.

Similar News

News February 15, 2026

టమాటాలో కాయ తొలుచు పురుగును ఎలా నివారించాలి?

image

టమాటాను కాయ తొలుచు పురుగు ఆశించి తొలుత లేత ఆకులు, కొమ్మలను తిని తర్వాత కాయలను తొలిచి నాశనం చేస్తుంది. ఈ పురుగుల నివారణకు పొలంలో అక్కడక్కడ ఎర పంటగా బంతి మొక్కలను నాటాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను పెట్టాలి. నాటిన 28, 35 రోజులకు లీటరు నీటికి ఫ్లూబెండమైడ్ 0.3ml కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉద్ధృతి ఎక్కువైతే లీటరు నీటికి క్లోరాంట్రనిలిప్రోల్ 0.3ML లేదా స్పైనోసాడ్ 0.4ML కలిపి పిచికారీ చేయాలి.

News February 15, 2026

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో 27 పోస్టులకు నోటిఫికేషన్

image

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ 27 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు మార్చి 4వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని మార్చి 19వరకు పంపాలి. పోస్టును బట్టి PG, PG(ఫిజికల్ ఎడ్యుకేషన్) MLSc, PhD, NET/SET/SLET, CA/CS/ICWA, BEd , MEd, మెడికల్ పీజీ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: https://careers.amuonline.ac.in/

News February 15, 2026

శివరాత్రి: శివుడికి రేగు పళ్లు సమర్పిస్తున్నారా?

image

శివుడికి నేడు రేగు పళ్లు సమర్పిస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ‘నరనారాయణులు ఈ చెట్టు కిందే తపస్సు చేసినప్పుడు దేవతలు వారిపై రేగు పళ్లు కురిపించారు. ఆరోగ్యపరంగా వీటితో ఎన్నో లాభాలున్నాయి’ అంటున్నారు. ‘ఇందులో ఉండే విటమిన్ C, ఫైబర్ రోగనిరోధక శక్తికి, జీర్ణక్రియకు చాలా దోహదపడతాయి. ఉపవాసంలో అలసటను తగ్గిస్తాయి. రక్తహీనతను నివారించి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి’ అని సూచిస్తున్నారు.