News January 8, 2026
కోళ్ల దాణా నిల్వలో ఈ జాగ్రత్తలు పాటించండి

కోళ్ల దాణా బస్తాలను గోడలకు, నేలకు తగలకుండా చెక్క పలకల మీద పేర్చాలి. రెండు వరుసల మధ్య 2 అడుగులు ఖాళీ ఉంచాలి. బాగా ఎండి, పొడిగా ఉన్న ముడి సరుకులనే నిల్వ చేయాలి. చలికాలంలో దాణాలో తేమ 9 శాతం కంటే ఎక్కువగా ఉండకూడదు. దాణాను 2-3 వారాలకు మించి నిల్వ చేయకూడదు. వేడిగా ఉన్న దాణా లేదా ముడి సరుకులను చల్లబడిన తర్వాతే గోదాముల్లో నిల్వ చేయాలి. లేకుంటే దాణా ఉంచిన బస్తాలపై తేమ పేరుకొని బూజు పడుతుంది.
Similar News
News February 7, 2026
ఒక్క ప్రమాదం.. ముమైత్ జీవితం తలకిందులు!

ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్‌తో సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ముమైత్ ఖాన్ ఇప్పుడు సినిమాల్లో కనిపించడం లేదు. ప్రస్తుతం తాను HYDలో మేకప్&హెయిర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ నడుపుతున్నట్లు ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘నాకు 30 ఏళ్లున్నప్పుడు ఇంట్లో జారిపడడంతో తలకు గాయమైంది. మెదడు నరాలు దెబ్బతిన్నాయి. 15రోజులు కోమాలో ఉన్నా. ఏడేళ్లు మంచానికే పరిమితమయ్యా. ఆ సమయంలో మా అమ్మే నన్ను చూసుకుంది’ అని తెలిపారు.
News February 7, 2026
గులాబీ తోటల్లో కనిపించే చీడపీడలు

శుభకార్యాలు, వ్యక్తిగత అవసరాల కారణంగా ప్రస్తుతం గులాబీ పూల వినియోగం బాగా పెరిగింది. మార్కెట్ డిమాండ్ బట్టి గులాబీ సాగుకు రైతులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ పువ్వుల సాగులో చీడపీడల సమస్య రైతులకు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గులాబీ పంటకు పువ్వు, మొగ్గలు తొలిచేపురుగు.. ఆకులను తిని ,రంధ్రాలు చేసే పెంకు పురుగులు, గొంగళి పురుగులు, నల్ల మచ్చ తెగులు, కొమ్మ ఎండు, బూడిద తెగులు ఆశించి నష్టపరుస్తున్నాయి.
News February 7, 2026
C-DOTలో పెయిడ్ ఇంటర్న్‌షిప్

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (<


