News August 28, 2025
కోవూరు పోలీసుల కస్టడికీ అరుణ

రౌడీ షీటర్ ప్రియురాలు అరుణను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. బిల్డర్‌ను బెదిరించిన కేసులో ఆమెను అరెస్ట్ చేసి ఒంగోలు జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈకేసును లోతుగా దర్యాప్తు చేసేందుకు అరుణను మూడు రోజుల కస్టడికీ తీసుకున్నారు. ఒంగోలు జైలు నుంచి కోవూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇక్కడే ఆమెను విచారించనున్నారు.
Similar News
News August 29, 2025
రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపాలి: DGP

నెల్లూరు జిల్లాలోని రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా జిల్లా పోలీసులను ఆదేశించారు. నెల్లూరులోని ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్షపై రివ్యూ నిర్వహించారు. నేర నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.
News August 28, 2025
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వాకాటి

బీజేపీలో 14 మందికి రాష్ట్ర అధికార ప్రతినిధులుగా అవకాశం కల్పించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన వాకాటి నారాయణరెడ్డిని అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. నెల్లూరు జిల్లాలో మంచిపట్టున్న నాయకుడిగా ఆయనకు పేరు ఉంది.
News August 28, 2025
నెల్లూరు: రికార్డ్ స్థాయిలో CMRF చెక్కుల పంపిణీ

మంత్రి ఆనం గురువారం సంతపేటలోని క్యాంపు కార్యాలయంలో ఒకే రోజు రికార్డ్ స్థాయిలో 100 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. పలు రకాల వ్యాధులతో బాధపడుతూ చికిత్స పొందిన బాధితులకు దాదాపు రూ.83.34 లక్షలను చెక్కుల రూపంలో ఇచ్చారు. ఇప్పటి వరకు ఆత్మకూరు నియోజకవర్గంలో 381 కుటుంబాలకు రూ.4.20 కోట్లు అందించామన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.