News December 19, 2025
కోవూరు MLAతో ఇన్‌ఛార్జ్ మేయర్ రూప్ కుమార్

నెల్లూరు ఇన్‌ఛార్జ్ మేయర్‌గా రూప్ కుమార్ యాదవ్ బాధ్యతలు తీసుకున్న అనంతరం పలువురు ప్రముఖులను కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్‌లో నివాసం ఉంటున్న కోవూరు MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రశాంతి రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నగర అభివృద్ధికి కృషి చేయాలని ఆమె రూప్ కుమార్ యాదవ్‌ను కోరారు.
Similar News
News December 24, 2025
నెల్లూరు: వేళాంగిణీ మాతా చర్చ్ కోసం తమిళనాడు వరకు వెళ్లక్కర్లేదు

వేళాంగిణీ మాతా చర్చ్ అంటే అందరికీ మొదట గుర్తు వచ్చేది తమిళనాడే. కానీ ఆ మాత దర్శనం కోసం తమిళనాడు వరకు వెళ్లాల్సిన పనిలేదు. 1987వ సంవత్సరంలో వేళాంగిణి మాత చర్చిని టీపీ గుడూరు(M) కోడూరు బీచ్ వద్ద నిర్మించారు. తమిళనాడు వేళాంగిణి మాత చర్చ్ తర్వాత అంతటి విశిష్టత ఈ చర్చికి ఉంది. క్రిస్మస్, జనవరి ఫస్ట్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాలలో పెద్ద స్థాయిలో భక్తులు ఇక్కడికి తరలి వస్తారు.
News December 24, 2025
99.21 % పల్స్ పోలియో వ్యాక్సిన్ నమోదు: DMHO

జిల్లావ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా 99.21% మంది చిన్నారులకు చుక్కల మందు ఇచ్చినట్లు జిల్లా వైద్యాధికారిని సుజాత తెలిపారు. ఆది, సోమ, మంగళవారాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 0-5 సం.లలోపు చిన్నారులకు తొలిరోజు 2,83,173, 2వ రోజు 4,461, 3వ రోజు 4,628 మందికి పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు.
News December 24, 2025
నెల్లూరు: మరింత వేగంగా విజయవాడకు.!

విజయవాడ-గూడూరు మధ్య నాలుగో రైల్వే లైన్‌కు అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ దారిలో 280కి.మీ మేర మూడో ట్రాక్ నిర్మాణం పూర్తి కావొచ్చింది. సరకు రవాణాతోపాటు హై స్పీడ్ రైళ్ల రాకపోకల కోసం కేంద్రం నాలుగో లైన్ ఏర్పాటుకు సన్నాహకాలు చేస్తోన్నట్లు సమాచారం. ఇది పూర్తి అయితే VJD-GDR మధ్య రవాణా సమయం మరింత తగ్గనుంది. కావలి, కోవూరు, నెల్లూరు, సర్వేపల్లి, గూడూరు నియోజకవర్గాల మీదుగా ఈ నిర్మాణం జరగనుంది.


