News October 9, 2025
కోస్గి: ‘కోర్టు తీర్పు నిరాశ కలిగించింది’

బీసీ రిజర్వేషన్లపై కోర్టు తీర్పు బాధ కలిగించిందని ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. బీసీ కులాలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రిజర్వేషన్లు ఊరించి ఉసూరుమనిపించాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు అగ్రవర్ణాల వారు బీసీలపై కక్ష కట్టి కేసు వేయడం హేయమైన చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు.
Similar News
News October 10, 2025
సంగారెడ్డి: ‘అర్థమయ్యేలా పుస్తకాలు రూపొందించడం అభినందనీయం’

విద్యార్థులకు అర్థమయ్యేలా సులభంగా పుస్తకాలు రూపొందించడం అభినందనీయమని సంగారెడ్డిలోని తార ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ అన్నారు. రాజనీతి శాస్త్ర అధ్యాపకురాలు జోష్ణ, కంప్యూటర్ అప్లికేషన్ అధ్యాపకులు నాగప్రసాద్ రూపొందించిన పుస్తకాలను గురువారం ఆమె ఆవిష్కరించారు. ఈ పుస్తకాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయని ప్రిన్సిపల్ పేర్కొన్నారు.
News October 10, 2025
జూబ్లీహిల్స్ : ఓపెన్ వర్సిటీలో నేడు ప్లేస్‌మెంట్ డ్రైవ్

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ క్యాంపస్‌లో స్టైఫండ్ బేస్డ్ అప్రెంటీస్‌షిప్ ప్రోగ్రాంలో చేరిన విద్యార్థులక ఈ-ప్లేస్‌మెంట్ డ్రైవ్ శుక్రవారం నిర్వహిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డా.ఎల్వీకే రెడ్డి తెలిపారు. ఈ డ్రైవ్‌లో 8 ప్రముఖ రిటైల్ సంస్థలు పాల్గొంటున్నాయన్నారు. ప్లేస్‌మెంట్ డ్రైవ్ ఉ.10 గంటలు నుంచి సీఎస్‌టీడీ భవనంలో ప్రారంభమవుతుందని తెలిపారు.
News October 10, 2025
కాబుల్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు?

అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌పై పాక్ వైమానిక దాడులు జరిపినట్లు తెలుస్తోంది. కాబుల్‌లో పేలుళ్లు సంభవించినట్లు వార్తలొస్తున్నాయి. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్(TTP) ఉగ్రవాదులే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ఈ దాడుల్లో తాను మరణించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని TTP చీఫ్ ముఫ్తీ నూర్ మెహ్సూద్ ఖండించారు. కాగా AFG ప్రభుత్వం TTP ఉగ్రవాద సంస్థకు మద్దతు ఇస్తోందని PAK రక్షణ మంత్రి ఇటీవల ఆరోపించారు.