News November 11, 2025
కోస్గి: చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి

చేపల వేటకు వెళ్లి ప్రమాదవశా త్తు ఓ దివ్యాంగుడు మృతి చెందిన సంఘటన కోస్గి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. SI బాలరాజ్ కథనం.. సోమవారం సాయంత్రం ఈర్లపల్లి చెరువుకు చేపల కోసం వెళ్లి ఆంజనేయులు(30) వెళ్లి మరణించాడు. బతుకుదెరువు కోసం కల్వకుర్తి నుంచి గుండుమాల్ దగ్గరలోని అప్పయ్య పల్లికి వచ్చాడు. మృతునికి భార్య కుమారుడు ఉన్నారు.
Similar News
News November 11, 2025
పెట్టుబడులు పెట్టే స్థాయికి యువత ఎదగాలి: సీఎం చంద్రబాబు

వంగర మండలంలోని అరసాడలో రూ.102 కోట్లతో నిర్మించనున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్‌కి ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి వర్చువల్‌గా సీఎం చంద్రబాబు ప్రారంభించారు. పెట్టుబడులకు ఆకర్షితులు కాకుండా పెట్టుబడులు పెట్టే స్థాయికి యువత ఎదగాలని పిలుపునిచ్చారు. యువ పారిశ్రామికవేత్తలు మట్టిలో మాణిక్యాలు అని, ప్రభుత్వ అవకాశాలను వినియోగించుకోవాలన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని ఆకాంక్షించారు.
News November 11, 2025
విద్యతోనే పేదరికం నిర్మూలన: కలెక్టర్ అనుదీప్

విద్య ద్వారానే పేదరికం నుంచి శాశ్వత విముక్తి సాధ్యమని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ విద్యా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన, మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను స్మరించారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేసి ప్రతి వర్గానికి విద్య అందేలా కృషి చేశారని తెలిపారు. మైనారిటీ గురుకులాల ద్వారా బాలికల విద్యాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
News November 11, 2025
వైసీపీ పాలనలో పారిశ్రామికవేత్తలు పారిపోయారు: సీఎం

AP: సంక్షేమం, అభివృద్ధిలో ఏపీ బ్రాండ్‌ను మళ్లీ తీసుకొస్తున్నామని CM చంద్రబాబు చెప్పారు. ప్రతి ఇంట్లో ఓ పారిశ్రామికవేత్త ఉండాలనేది తమ లక్ష్యమన్నారు. ప్రకాశం(D) కనిగిరిలో MSMEల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘YCP పాలనలో బెదిరింపులతో పారిశ్రామికవేత్తలు పారిపోయారు. మా హయాంలో పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ప్రతి 50కి.మీలకు ఒక పోర్టు నిర్మిస్తాం’ అని పేర్కొన్నారు.


