News July 9, 2025
కోస్గి: ‘భవనాల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి’

కోస్గి, గుండుమల్, కొత్తపల్లి మండలాల్లో నిర్మాణంలో ఉన్న మండల కాంప్లెక్స్, జూనియర్ కళాశాల, ఇతర ప్రభుత్వ కార్యాలయ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయా మండలాల్లో ఆమె పర్యటించారు. నిర్మాణ పనులు గడువులోగా పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. మూడు మండలాల తహశీల్దారులు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
Similar News
News July 9, 2025
27వ అంతర్జాతీయ పురస్కారం అందుకున్న మోదీ

నమీబియా పర్యటనలో ఉన్న PM మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం దక్కింది. ‘ఆర్డర్ ఆఫ్ ది ఏన్షియంట్ వెల్‌విట్షియా మిరాబిలిస్’ పురస్కారాన్ని నమీబియా అధ్యక్షురాలు నెతుంబో నంది ప్రధానికి అందజేశారు. 2014లో PM అయినప్పటి నుంచి మోదీకి ఇది 27వ అంతర్జాతీయ అవార్డు. 5దేశాల పర్యటనలో భాగంగా ఆయన ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్ దేశాల్లో పర్యటించి ఆ దేశాల పురస్కారాలు అందుకున్న విషయం తెలిసిందే.
News July 9, 2025
గిరి ప్రదక్షణలో తప్పిపోయిన బాలుడిని తల్లి చెంతకి చేర్చిన పోలీసులు

సింహాచలం “గిరి ప్రదక్షణ”లో పైనాపిల్ కాలనీ సమీపంలో రెండు సంవత్సరాల బాలుడు దిక్కుతోచని స్థితిలో తిరగడం పోలీసులు గమనించి వివరాలు అడుగగా చెప్పలేకపోయాడు. వెంటనే పోలీసులు పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టమ్ ద్వారా బాలుడు గుర్తులు తెలియజేస్తూ ప్రకటన చేశారు. బాలుడు తల్లి అది విని సమీపంలో పోలీసులు ద్వారా అక్కడికి చేరుకున్నారు. బాలుడిని ఆమెకు క్షేమంగా అప్పగించారు. పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
News July 9, 2025
గ్రంథాలయాల అభివృద్దికి చర్యలు: జేసీ

జిల్లాలో గ్రంథాలయాల అభివృద్దికి చర్యలు తీసుకోవాలని జేసీ, జిల్లా గ్రంథాలయ సంస్థ ఇన్‌ఛార్జ్ ఎస్.సేతు మాధవన్ ఆదేశించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ బడ్జెట్ సమావేశం జేసీ ఛాంబర్‌లో బుధవారం జరిగింది. పౌర గ్రంథాలయశాఖ డైరెక్టర్ సూచనలు, కేటాయించిన బడ్జెట్‌కు అనుగుణంగా, త్వరలో జరగబోయే సర్వసభ్య సమావేశం గురించి, ప్రస్తుత ఆర్థికసంవత్సరంలో చర్యలు గురించి చర్చించారు.