News December 24, 2025

కోస్గి సభతో ఉమ్మడి జిల్లాలో రాజకీయ వేడి

image

నేడు నారాయణపేట జిల్లా కోస్గిలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనే సభపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ మరో 20 రోజుల్లో మహబూబ్‌నగర్ జిల్లాలో సభ నిర్వహిస్తామని ప్రకటించడంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో కోస్గి వేదికగా సీఎం ఏం మాట్లాడతారన్నది చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు నేతల సభలతో ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి.

Similar News

News December 26, 2025

అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయండి: కేంద్ర మంత్రికి CBN వినతి

image

AP: వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ను CM CBN కోరారు. పంచసూత్రాల ప్రణాళిక అమలుతో వ్యవసాయ అనుబంధ రంగాల్లో 10.70% అభివృద్ధి సాధించామన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని, రూ.2,585 కోట్ల అంచనాతో డీపీఆర్‌ను వ్యవసాయ పరిశోధన, విద్య విభాగానికి ఇప్పటికే సమర్పించినట్టు వినతిపత్రంలో పేర్కొన్నారు.

News December 26, 2025

రెడ్ కలర్ చూస్తే ఎద్దులు దాడి చేస్తాయా! నిజమేంటి?

image

రెడ్ కలర్ ఎద్దులకు నచ్చదని, దాడి చేస్తాయనేది అపోహ మాత్రమే. చాలా పశువుల్లాగే ఎద్దులకు కూడా రెడ్ కలర్‌ను గుర్తించే రెటీనా సెల్స్ ఉండవు. ఎద్దులు డైక్రోమాట్స్ (2కలర్ రిసెప్టర్లు) కావడంతో ఎల్లో, బ్లూ, గ్రీన్, వయొలెట్ రంగులను గుర్తించగలవు. వాటికి ఎరుపు రంగు గ్రేయిష్-బ్రౌన్ లేదా ఎల్లోయిష్-గ్రేలా కనిపిస్తుంది. వేగమైన కదలికల కారణంగా దాడికి దిగుతాయి. తెలుపు, నీలం రంగు క్లాత్స్ కదిలించినా దాడి చేస్తాయి.

News December 26, 2025

GHMC: కొత్త జోనల్ కమిషనర్లు వీళ్లే

image

*శేరిలింగంపల్లి: భోర్ఖడే హేమంత్ సహదేవ్‌రావు
* కూకట్‌పల్లి: అపూర్వ్ చౌహాన్
* కుత్బుల్లాపూర్: సందీప్ కుమార్ ఝా
* చార్మినార్: ఎస్. శ్రీనివాస్ రెడ్డి
* గోల్కొండ: జి. ముకుంద రెడ్డి
* ఖైరతాబాద్: ప్రియాంక అలా
* రాజేంద్రనగర్: అనురాగ్ జయంతి
* సికింద్రాబాద్: ఎన్. రవి కిరణ్
* శంషాబాద్: కె. చంద్రకళ
* ఎల్.బి.నగర్: హేమంత కేశవ్ పాటిల్
* మల్కాజ్‌గిరి: సంచిత్ గంగ్వార్
* ఉప్పల్: రాధికా గుప్తా