News July 7, 2025

కోహెడ: అతివేగంతో యాక్సిడెంట్.. ఇద్దరి మృతి

image

కోహెడ మండలం తంగళ్లపల్లిలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో <<16971399>>ఇద్దరు <<>>యువకులు మృతిచెందిన విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన శ్రీకాంత్(22), రిషి(15) రాత్రి బైక్‌పై కోహెడ వెళ్తున్నారు. అతివేగంతో కొత్తూరు సత్తయ్య ఇంటి గోడను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనా స్థలంలో మద్యం బాటిళ్లు ఉండటంతో మత్తులో ప్రమాదం జరిగినట్లు గ్రామస్థులు అనుమానిస్తున్నారు.

Similar News

News July 7, 2025

రేపే అరుణాచలం యాత్ర బస్సు ప్రయాణం: GDK – DM

image

కాణిపాకం, అరుణాచలం, జోగులాంబ, గోల్డెన్ టెంపుల్ వీక్షించే యాత్రికులకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు గోదావరిఖని డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. మంగళవారం ఈ బస్సు ప్రారంభమవుతుందన్నారు. ఆసక్తిగల భక్తులు బుకింగ్ కోసం 7013504982 ను సంప్రదించాలని కోరారు. ఈ యాత్రకు రాజధాని AC బస్సు సమకూర్చామన్నారు. ఛార్జీలు పెద్దలకు ₹5900, పిల్లలకు ₹4900గా నిర్ణయించామన్నారు.

News July 7, 2025

పామిడిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

పామిడిలోని జగన్నాథ పద్మావతి కన్వెన్షన్ హాల్‌లో సోమవారం కలెక్టర్ డా.వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

News July 7, 2025

శ్రీకాకుళం: గిరి ప్రదక్షిణకు వెళ్తున్నారా..రూట్ మ్యాప్ ఇదే

image

గిరి ప్రదక్షిణ సందర్భంగా ఈనెల 9 ఉ.6 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 5 వరకు విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి అనకాపల్లి వైపు వచ్చు ప్రైవేటు ట్రావెల్ బస్సులు, RTC బస్సులు, ఇతర వాహనదారులు నగరంలోకి రాకుండా ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా అనకాపల్లి చేరుకోవాలని సూచించారు.