News July 5, 2025

కోహెడ: ‘గురుకుల మైదానంలో మొక్కలు నాటాలి’

image

గురుకుల మైదానంలో మొక్కలు నాటాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె.హైమావతి సూచించారు. కోహెడ మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ కె.హైమావతి ఆకస్మికంగా తనికి చేశారు. రిజిస్టర్ వెరిఫై చేసిన అనంతరం పాఠశాల మైదానాన్ని పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.

Similar News

News July 5, 2025

శుభ్‌మన్ గిల్ ఆల్‌టైమ్ రికార్డ్

image

టీమ్‌ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆల్‌టైమ్ రికార్డ్ బద్దలు కొట్టారు. ఒక టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లో కలిపి అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్‌గా అవతరించారు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో గిల్ ఫస్ట్ ఇన్నింగ్సులో 269, రెండో ఇన్నింగ్సులో 80 రన్స్ కలిపి 349* పరుగులు చేశారు. ఈ క్రమంలో సునీల్ గవాస్కర్ (344) రికార్డును ఆయన చెరిపేశారు. వీరిద్దరి తర్వాత లక్ష్మణ్ (340), గంగూలీ (330), సెహ్వాగ్ (319) ఉన్నారు.

News July 5, 2025

‘లోక్ అదాలత్‌లో 116 కేసులు రాజీ’

image

పార్వతీపురం మన్యం జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్‌లో 116 కేసులను ఇరువురి అంగీకారంతో రాజీ చేయడం జరిగిందని రెండవ అదనపు జిల్లా జడ్జి ఎస్. దామోదరరావు అన్నారు. న్యాయస్థానం ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి సహకరించడం శుభ పరిణామం అన్నారు.

News July 5, 2025

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం- DEO

image

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు 2025 కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నాగర్‌కర్నూల్ డీఈఓ రమేష్ కుమార్ శనివారం తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, జిల్లా పరిషత్, ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అవార్డుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. 10 ఎళ్ల సర్వీస్ పూర్తయిన ఆసక్తిగల ఉపాధ్యాయులు https://nalawardstoteachers.education.gov.in దరఖాస్తు చేసుకోవాలన్నారు.