News December 11, 2025
కోహ్లీ, రోహిత్ జీతాలు తగ్గించనున్న BCCI

వన్డేలకే పరిమితమైన రోహిత్, కోహ్లీల శాలరీలను BCCI తగ్గించే అవకాశముంది. ఈనెల 22న బోర్డు వార్షిక కౌన్సిల్ భేటీలో ఇద్దర్నీ A+ కేటగిరీ నుంచి Aకు మారుస్తారని సమాచారం. ఇక కెప్టెన్ శుభ్‌మన్ గిల్ Aనుంచి A+కు ప్రమోట్ కానున్నారు. అంపైర్స్, రిఫరీల రెమ్యునరేషన్ అంశాలపైనా ఇందులో చర్చ జరగనుంది. ప్లేయర్లకు A+, A, B, C కేటగిరీలుగా బోర్డు శాలరీలు ఇస్తోంది.
A+: ₹7కోట్లు, A: ₹5కోట్లు, B: ₹3కోట్లు, C: ₹1కోటి.
Similar News
News December 12, 2025
వారణాసిలో 5 గెటప్‌లలో మహేశ్ బాబు!

రాజమౌళి-మహేశ్ కాంబోలో రూపొందుతున్న ‘వారణాసి’ నుంచి ఓ క్రేజీ అప్డేట్ వైరలవుతోంది. మహేశ్ 5 పాత్రల్లో కన్పిస్తారని సినీ వర్గాలు చెబుతున్నాయి. విజువల్ వండర్‌గా, సరికొత్త యాక్షన్ ప్యాక్డ్ అవతారాలలో హీరోను తెరపై చూపించనున్నారని టాక్ నడుస్తోంది. ‘రుద్ర’, రాముడిగా కనిపిస్తారని ఇప్పటికే రాజమౌళి 2 గెటప్‌లను రివీల్ చేయగా, మిగతా 3 ఏమై ఉంటాయని చర్చ జరుగుతోంది. ఈ ప్రచారం నిజమైతే మహేశ్ ఫ్యాన్స్‌కు పండగే.
News December 12, 2025
మరణించినట్లు కలలు వస్తే.. అది దేనికి సంకేతం?

ఓ వ్యక్తికి తాను చనిపోయినట్లు పదేపదే కలలు వస్తుంటే భయపడాల్సిన అవసరం లేదని స్వప్నశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇది మంచి ఫలితాన్నే సూచిస్తుందని అంటున్నారు. ‘ఏదైనా సంక్షోభం లేదా మరణ ముప్పు ఇప్పటికే దాటిపోయిందని, దాని నుంచి మీరు తప్పించుకున్నారని ఈ కలలు సూచిస్తాయి. అయితే ప్రమాదానికి గురైనట్లు కలలు వస్తే దాన్ని హెచ్చరికలా భావించి జాగ్రత్తగా ఉండాలి’ అని సూచిస్తున్నారు.
News December 12, 2025
వరి నాట్లు వేసేటప్పుడు జాగ్రత్తలు(2/2)

వరి నారును పొలంలో నాటేముందు కొనలు తుంచి నాటాలి. దీని వల్ల నారు కొనలలో కాండం తొలుచు పురుగు, ఇతర పురుగులు పెట్టిన గుడ్లను నాశనం చేయవచ్చు. నాట్లు పైపైనే 3సెంటీమీటర్ల లోతులోనే నాటాలి. దీనివల్ల మొక్కల్లో పిలకలు ఎక్కువగా వస్తాయి. నాటేటప్పుడు పొలంలో ప్రతి 2 మీటర్ల దూరానికి 20 సెం.మీ కాలిబాటలు వదలాలి. కాలిబాటలు తూర్పు పడమర దిశగా ఉంచాలి. దీనివల్ల మొక్కలకు గాలి, వెలుతురు బాగా అంది చీడల సమస్య తగ్గుతుంది.


