News June 3, 2024
కౌంటింగ్‌కు ఇవి తీసుకెళ్తే కేసులు తప్పవు: అనంతప ఎస్పీ

అనంతలో ఎన్నికల కౌంటింగ్‌కు వెళ్లే అభ్యర్థులు, ఏజెంట్లు నీటి సీసాలు, ఇంక్ పెన్నులు, ఫోన్‌లు తీసుకెళ్లరాదని ఎస్పీ గౌతమి శాలి సూచించారు. కౌంటింగ్ కేంద్రంలో ఏ చిన్న గొడవ జరిగినా వెబ్‌కాస్టింగ్‌లో రికార్డవుతుందన్నారు. అక్కడ తోసుకోవడం, కౌంటింగ్ ప్రాంతంలో మెష్ పడేయడం వంటివి చేస్తే ఫిర్యాదు తీసుకుని కేసులు నమోదు చేస్తామన్నారు. అందరూ శాంతియుత వాతావరణానికి సహకరించాలన్నారు.
Similar News
News September 14, 2025
వైద్యాధికారులతో అనంతపురం కలెక్టర్ సమావేశం

అనంతపురం జిల్లా కొత్త కలెక్టర్ ఆనంద్‌ను DMHO డాక్టర్ దేవి పుష్పగుచ్చంతో శనివారం స్వాగతించారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే వైద్య అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులకు అందుతున్న సేవలపై DMHOతో చర్చించారు. జిల్లాలో PHC, CHC, విలేజ్ హెల్త్ సెంటర్, క్లినిక్‌ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
News September 13, 2025
అనంతపురం జిల్లా కలెక్టర్‌గా ఆనంద్ బాధ్యతలు

అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో ఆనంద్ శనివారం నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. జిల్లా ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని వివరించారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని జిల్లా ప్రజలకు సూచించారు.
News September 13, 2025
‘అనంత జిల్లాకు వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండండి’

అనంతపురం జిల్లాలో ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదవుతున్నాయని శాస్త్రవేత్త విజయ్ శంకర్ బాబు తెలిపారు. మేఘాలు కమ్ముకుని అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రత 33.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 20.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతుందన్నారు. పశ్చిమ దిశగా గాలులు గంటకు 8 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో వీస్తాయన్నారు.