News February 12, 2026

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు: సీపీ సన్‌ప్రీత్ సింగ్‌

image

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో జనగామ, స్టే.ఘ, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాటు చేసినట్లు CP సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో బీఎన్‌ఎస్ 163 ప్రకారం నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయని, ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నేరమని హెచ్చరించారు.

Similar News

News February 12, 2026

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత: ఎస్పీ శబరీష్

image

జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ శబరీష్‌ తెలిపారు. మహబూబాబాద్‌, డోర్నకల్‌, కేసముద్రం, తొర్రూరు, మరిపెడ కేంద్రాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల పరిసరాల్లో 163 బీఎన్‌ఎస్‌ఎస్‌ (144 సెక్షన్‌) అమలులో ఉంటుందని, ఎవరూ గుమిగూడకూడదని హెచ్చరించారు.

News February 12, 2026

ఆగస్టు 21న నాని ‘ప్యారడైజ్’ విడుదల

image

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తోన్న ‘ప్యారడైజ్’ చిత్రం విడుదల వాయిదా పడింది. మార్చి 26న రావాల్సిన ఈ మూవీని ఆగస్టు 21న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘నేను తొందరపడాలి అనుకోవట్లేదు. దీనికి నాకు కొంత సమయం కావాలి. 21-08-2026న ప్యారడైజ్ వస్తుంది’ అని పేర్కొంటూ శ్రీకాంత్ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. మోహన్ బాబు విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

News February 12, 2026

సంగారెడ్డి: 11 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ కేంద్రాలు ఇవే!

image

మున్సిపాలిటీల్లో కౌంటింగ్ కేంద్రాలు ఇవే..
1) అందోల్-జోగిపేట: పాలిటెక్నిక్ బాలికల కళాశాల
2) గడ్డపోతారం: ZPHS
3) గుమ్మడిదల: ZPHS
4) ఇంద్రేశం: గిరిజన డిగ్రీ గురుకుల కళాశాల
5) ఇస్నాపూర్: ZPHS
6) జిన్నారం: ZPHS
7) కోహిర్: ప్రభుత్వ జూనియర్ కళాశాల
8) నారాయణఖేడ్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల
9) సదాశివపేట: ప్రభుత్వ జూనియర్ కళాశాల
10) సంగారెడ్డి: డిగ్రీ కళాశాల
11) జహీరాబాద్: గురుకుల కళాశాల