News February 12, 2026

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత: ఎస్పీ శబరీష్

image

జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ శబరీష్‌ తెలిపారు. మహబూబాబాద్‌, డోర్నకల్‌, కేసముద్రం, తొర్రూరు, మరిపెడ కేంద్రాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల పరిసరాల్లో 163 బీఎన్‌ఎస్‌ఎస్‌ (144 సెక్షన్‌) అమలులో ఉంటుందని, ఎవరూ గుమిగూడకూడదని హెచ్చరించారు.

Similar News

News February 16, 2026

MBNR: U-17 క్రికెట్ టోర్నీ విజేతగా మహబూబ్‌నగర్

image

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మినీ స్టేడియంలో 69వ ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి అండర్-17 క్రికెట్ బాలుర టోర్నమెంట్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల నుంచి పది జట్లు పాల్గొనగా.. మొదటి స్థానంలో మహబూబ్‌నగర్, రెండో స్థానంలో ఖమ్మం, రంగారెడ్డి జిల్లా మూడో స్థానంలో నిలిచాయి. గెలిచిన జట్లకు బహుమతులు ప్రదానం చేశారు. ఎంఈఓ మంజులాదేవి, SGF సెక్రటరీ ఆర్.శారదాబాయి, స్థానిక నేతలు, పీడీలు పాల్గొన్నారు.

News February 16, 2026

సమష్టి కృషితో జిల్లా ప్రగతి: నల్గొండ కలెక్టర్

image

నల్గొండ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజావాణి’లో ఆయన పాల్గొని బాధితుల నుంచి 82 వినతులను స్వీకరించారు. కోర్టు కేసులు, కమిషన్లలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై వెంటనే కౌంటర్‌ దాఖలు చేయాలని సూచించారు. మార్చి నెలాఖరులోగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.

News February 16, 2026

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం: కలెక్టర్

image

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. అనంతపురం జిల్లాలో 147 కాలేజీలుండగా 64 సెంటర్లు, 18 జోన్లు ఏర్పాటు చేశామన్నారు. ఇంటర్ ఫస్ట్, సెకండియర్‌‌లో 48,146 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. ఫస్టియర్‌లో జనరల్ 22,366, ఒకేషనల్ 2,202 మొత్తం 24,568 మంది, సెకండియర్‌ జనరల్ 1,965, ఒకేషనల్ 21,613 కాగా మొత్తం 23,578 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు.