News March 3, 2025

కౌంటిగ్ ప్రారంభం.. ఈ ముగ్గురిలో గెలుపు ఎవరిదో ?

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం ఉదయం ఏయూలో ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. ఈనెల 27న జరిగిన ఎన్నికల్లో పదిమంది అభ్యర్థులు పోటీ పడ్డారు. వీరిలో ప్రస్తుత ఎమ్మెల్యే పాకలపాటి రఘువర్మ, మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, పీడీఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజయ గౌరీ హోరాహోరీగా తలపడ్డారు. 20,794 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Similar News

News November 4, 2025

160 సీట్లకు పైనే గెలుస్తాం: అమిత్ షా

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. 160కి పైగా స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, జేడీయూ సమాన సీట్లు సాధిస్తాయని అన్నారు. గత 11 ఏళ్లలో రోడ్లు, బ్రిడ్జిలు, పవర్ ప్లాంట్లు వంటి అతి ముఖ్యమైన మౌలిక సదుపాయాలను బలోపేతం చేశామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి అవకాశాల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

News November 4, 2025

ఎల్లారెడ్డి: జాతీయ రహదారి పనులకు సహకరించాలి: RDO

image

ఎల్లారెడ్డి పట్టణంలో జరుగుతున్న జాతీయ రహదారి పనులకు సహకరించాలని ఆర్డీఓ పార్థ సింహారెడ్డి ప్రజలను కోరారు. మంగళవారం ఆయన వ్యాపార సముదాయము, దుకాణాలు, ఇళ్ల యజమానులతో సమావేశమై మాట్లాడారు. జాతీయ రహదారి పనులకు ఆటంకం కలిగించొద్దన్నారు. దుకాణ యజమానులు అక్రమ కట్టడాలను తొలగించుకోవాలని సూచించారు. అభివృద్ధి పనులు ప్రజా హితం కోసమే జరుగుతున్నాయన్నారు.

News November 4, 2025

అమరావతి విజన్ రూపకల్పనలో భాగస్వామ్యం కావాలని CRDA పిలుపు

image

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భవిష్యత్తు విజన్ రూపకల్పనలో మీరు కూడా భాగస్వాములవ్వాలని CRDA కోరుతుంది. అభిప్రాయాన్ని నమోదు చేసేందుకు ఈ లింక్‌ను క్లిక్ చేసి లేదా QR కోడ్‌ను స్కాన్ చేయాలని లింక్ https://tinyurl.com/4razy6ku రూపొందించింది. అమరావతి ప్రాంత అభివృద్ధికి విజన్ 2047 రూపొందించడంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చింది.