News November 6, 2025
కౌడిపల్లి: కోళ్ల వ్యాన్ ఢీకొని వ్యక్తి మృతి

కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వెంకట్రావుపేట్ గ్రామానికి చెందిన కొన్యాల దత్తయ్య(57) నడిచి వెళ్తుండగా.. రాంగ్‌రూట్‌లో వచ్చిన కోళ్ల వ్యాన్ ఢీకొట్టింది. స్థానికులు వెంటనే దత్తయ్యను అంబులెన్స్ వాహనంలో హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 13, 2026
MDK: రాత్రికి నీటి విడుదల.. ప్రజలు జాగ్రత్త

ఇవాళ రాత్రి 8 గంటల నుంచి మంజీరా బ్యారేజ్ నుంచి ఘనపూర్ ఆనికట్‌కు 0.3 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. సెకనుకు 1,070 క్యూసెక్కుల చొప్పున నీటిని వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే సునీతా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా విజ్ఞప్తి చేశారు. నదీ ప్రవాహానికి ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ప్రజలకు అవగాహన కల్పించి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News April 13, 2026
మెదక్ జల్లాలో 18వ శతాబ్దపు తెలుగు శాసనం గుర్తింపు

మెదక్ జిల్లా వరిగుంతం గ్రామంలో బుర్ర సంతోష్ 18వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనాన్ని గుర్తించారు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్ పరిశీలించి, ఇది ఎఱయప్రోలు పేరు మీద ఇచ్చిన దానం గురించి తెలుపుతుందని నిర్ధారించారు. గ్రామం యొక్క పురాతన చరిత్రకు నిదర్శనమైన ఇటువంటి శాసనాలను, విగ్రహాలను భావి తరాల కోసం ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
News April 13, 2026
తూప్రాన్: తల్లిదండ్రులకు విజయాన్ని అంకితం చేసిన శ్రావణి

తూప్రాన్ ఎంజేపీ బాలికల కళాశాల విద్యార్థిని శ్రావణి ఇంటర్ ఎంపీసీలో 950 మార్కులతో సత్తా చాటింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినా.. పట్టుదలతో చదివి ఈ విజయం సాధించింది. టెన్త్ బోనాల ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేసిన శ్రావణి.. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఇంటర్‌లో రాణించింది. తన విజయాన్ని అమ్మానాన్నలకు అంకితం చేస్తున్నట్లు తెలిపింది. భవిష్యత్తులో గ్రూప్-1 సాధించడమే తన లక్ష్యమని శ్రావణి పేర్కొంది.


