News January 11, 2025

కౌతాళం మండలంలో మహిళ హత్య

image

కర్నూలు జిల్లా కౌతాళం మండలంలో దారుణ హత్య జరిగింది. కర్ణాటక సరిహద్దు సుళేకేరి గ్రామానికి చెందిన బసమ్మ (52)కు భర్త కురువ మారెప్ప మృతి చెందడంతో ఒంటరిగా జీవిస్తోంది. ఆమె శుక్రవారం ఉదయం ఉచిత గ్యాస్ కోసం హచ్చోళ్లికి బయలుదేరగా మురవణి గ్రామ పొలాల్లో హత్యకు గురైంది. దుండగులు గొంతుకోసి హత్య హత్యచేసినట్లు సమాచారం. ఘటనపై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 11, 2025

పోరాట వీరుడు!

image

నేడు వడ్డే ఓబన్న జయంతి. ఈయన ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి నమ్మిన బంటు. ముఖ్య అనుచరుడిగా ఉంటూ ఉద్యమాలకు ఊపిరిపోశారు. ఓబన్న సంజామల మండలం నొస్సం గ్రామానికి చెందిన వడ్డె సుబ్బయ్య, సుబ్బమ్మ దంపతులకు 1807 జనవరి 11న జన్మించారు. నరసింహారెడ్డి తాతది ఇదే గ్రామం కావడంతో ఇరు కుటుంబాలకూ సంబంధాలు ఉండేవి. 1846 అక్టోబరు 6న బ్రిటిష్‌ వారితో పోరాటంలో ఓబన్న 39ఏళ్లకే వీరమరణం పొందారు. ఆ తర్వాత నరసింహారెడ్డిని ఉరితీశారు.

News January 11, 2025

నేడు కర్నూలు జిల్లాలో పవన్ కళ్యాణ్ ఏరియల్‌ వ్యూ

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో పిన్నాపురం వద్ద రూ.15 వేల కోట్లతో 5,230 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మాణంలో ఉన్న గ్రీన్‌కో రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టును ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. కాగా ఆసియాలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా పిన్నాపురం ఎనర్జీ ప్రాజెక్టు దేశ చరిత్రలో నిలిచిపోనుంది.

News January 11, 2025

భూ సమస్యలకు పరిష్కారం చూపండి: నంద్యాల కలెక్టర్

image

భూ రికార్డులలో మ్యూటేషన్ల దిద్దుబాటు, రెవెన్యూ సదస్సుల్లో భూ పరిష్కార నిమిత్తం స్వీకరించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మండల తహశీల్దార్లు, ఆర్డీవోలను ఆదేశించారు. నిర్ణీత కాలపరిమితిలోగా పరిష్కార మార్గాలు చూపాలని అన్నారు. శుక్రవారం నంద్యాల కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్‌తో కలిసి భూ సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు.