News October 15, 2025

‘కౌలు రైతులకు రుణాలు ఇవ్వకపోవడం మంచి పద్ధతి కాదు’

image

కౌలు రైతులకు రుణాలు ఇవ్వకపోవడం మంచి పద్ధతి కాదని కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం అన్నారు. 8వేల మంది కౌలు రైతులకు రూ.100 కోట్లు రుణాలు ఇవ్వాలనేది లక్ష్యం కాగా, కేవలం 2,326 మంది కౌలు రైతులకు రూ.8.80 కోట్ల రుణం ఇవ్వటమేమిటని ప్రశ్నించారు. పంటలు సాగు చేస్తున్న కౌలు రైతులు పెట్టుబడులు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే ఎందుకు పట్టించుకోవడంలేదని బ్యాంక్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Similar News

News October 15, 2025

రామాయంపేట: ఇంట్లో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

ఇంట్లో వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన రామాయంపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని ఝాన్సీ లింగాపూర్ గ్రామపంచాయతీ పరిధి సదాశివనగర్ తండాలో మంగళవారం రాత్రి మున్యా(36) తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న రామాయంపేట ఎస్సై బాలరాజు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

News October 15, 2025

తిర్యాణి: యూట్యూబర్‌కు 14 రోజులు రిమాండ్

image

తిర్యాని మండలం మంగి పాతగూడకు చెందిన యూట్యూబ్ వెంకటేశ్‌కు ఆసిఫాబాద్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినట్లు తిర్యాణి ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు. 3 రోజుల క్రితం యూట్యూబర్ వెంకటేశ్ ఓ సామాజిక వర్గాన్ని దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ పోస్టు వైరల్‌గా మారింది. సదరు వర్గానికి చెందిన నాయకులు అతడిపై పిర్యాదు చేయడంతో కోర్టు అతడికి 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్ఐ వెల్లడించారు.

News October 15, 2025

ప్రతి విద్యార్థి స్కూల్లో ఉండాలి: భట్టి విక్రమార్క

image

TG: విద్యారంగం ప్రతిష్టాత్మకమైందని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో Dy.CM భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ప్రగతిపై సమీక్షించారు. ‘పథకంలో సమస్యలుంటే యాజమాన్యాలు జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించాలి. విద్యార్థులను పంపేయడానికి వీల్లేదు. ఈ పథకం కింద ఎంపికైన ప్రతి విద్యార్థి పాఠశాలలో ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలి’ అని భట్టి ఆదేశించారు.