News March 19, 2025
కౌలు రైతులకు రూ.100 కోట్ల రుణాలు ఇవ్వాలి: బాపట్ల కలెక్టర్

వ్యవసాయంపై ఆధారపడిన జిల్లాలోని రైతులకు బ్యాంకర్లు అధిక రుణ సౌకర్యం కల్పించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. బ్యాంకర్ల జిల్లా స్థాయి సమీక్షా సమావేశం బుధవారం బాపట్ల కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ప్రాధాన్యత రంగాలు, ప్రాధాన్యత లేని రంగాలకు రుణాల పంపిణీలో నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు నూరు శాతం చేరుకోవాలన్నారు. కౌలు రైతులకు రూ.100 కోట్ల రుణాలు ఇవ్వాలన్నారు.
Similar News
News March 19, 2025
CBI, ED హోంశాఖ పరిధిలోకి రావు: అమిత్ షా

కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ హోంశాఖ పరిధిలోకి రావని ఆ శాఖ కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. రాజ్యసభలో టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే సీబీఐ హోంమంత్రిత్వశాఖ కొమ్ము కాస్తోందని ఆరోపించారు. దీనిపై అమిత్ షా స్పందించి సమాధానమిచ్చారు. సీబీఐపై తప్పుడు సమాచారం మానేయాలని హితవు పలికారు. గోఖలే ప్రస్తావిస్తున్న ఎన్నికల హింసలకు సంబంధించిన కేసులు సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు నమోదైనవని తెలిపారు.
News March 19, 2025
బాపట్ల: రూ.149 కోట్ల పనులు మంజూరు

జలజీవన్ మిషన్ద కింద జిల్లాకు రూ.149 కోట్లతో 337 పనులు మంజూరు అయ్యాయని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి అన్నారు. బుధవారం బాపట్ల కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా స్థాయి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జలజీవన్ మిషన్ క్రింద ప్రభుత్వం మంజూరు చేసిన పనులకు టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు.
News March 19, 2025
ములుగు: పది పరీక్షలు.. కలెక్టర్ కీలక ఆదేశాలు

ములుగు జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. మార్చి 21 నుంచి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో నిర్వహణ విద్యాశాఖ సిబ్బందికి కలెక్టర్ ముందస్తు సూచనలు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, కేంద్రం వద్ద ఇద్దరు పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. పరీక్ష పూర్తయ్యే వరకు ఎలాంటి కరెంట్ కోతలు ఉండవద్దన్నారు.