News March 25, 2025

క్యాన్సర్ బాధితుడి మాటలకు మంత్రి శ్రీధర్ బాబు కన్నీళ్లు

image

పలిమెల మండలం సర్వాయిపేట గ్రామానికి చెందిన నితిన్ క్యాన్సర్‌తో బాధపడుతూ HYDలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంత్రి శ్రీధర్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి తానున్నానని భరోసా కల్పించారు. ‘సార్.. నేను మంచి క్రికెటర్ కావాలనుకున్నా, క్రికెట్ కిట్ ఇప్పించండి’ అని నితిన్‌ అనడంతో శ్రీధర్ బాబు కన్నీళ్లు పెట్టుకున్నారు. క్రికెట్ కిట్ తెప్పించి అతడి కోరికను తీర్చారు.

Similar News

News December 22, 2025

మావోలపై తుది పోరు.. బస్తర్‌పై బలగాల గురి!

image

మావోయిస్టులపై కేంద్రం చేపట్టిన ఆపరేషన్ చివరి అంకానికి చేరుకుంది. మార్చి 31 <<18321115>>డెడ్‌లైన్<<>> సమీపిస్తుండటంతో మావోల కంచుకోట దక్షిణ బస్తర్‌(ఛత్తీస్‌గఢ్‌)ను బలగాలు టార్గెట్ చేశాయి. అక్కడ కీలక నేతలు పాపారావు(57), బర్సా దేవా(48)తోపాటు 150 మంది మావోలు ఉన్నట్లు అంచనా వేస్తున్నాయి. వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. 2025లో బస్తర్‌లో జరిగిన 96 ఎన్‌కౌంటర్లలో 252మంది మావోయిస్టులు, 23మంది భద్రతా సిబ్బంది చనిపోయారు.

News December 22, 2025

ADB: నేడు సర్పంచ్‌ల బాధ్యతల స్వీకరణ!

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పంచాయతీలు నేడు కొత్త శోభను సంతరించుకున్నాయి. ఉమ్మడి జిల్లాలోని మూడు విడతల ఎన్నికల్లో ప్రజలు ఎన్నుకున్న కొత్త పాలకవర్గాలు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నాయి. పంచాయతీ కార్యాలయాలను తోరణాలు, పూలతో ముస్తాబు చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో ఈ క్రతువు సాగనుంది. పల్లెల అభివృద్ధిలో నూతన అధ్యాయం మొదలవుతుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

News December 22, 2025

శ్రీకాకుళం: పోలియో సిరా చుక్క..ఎందుకంటే?

image

శ్రీకాకుళం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం 93% పూర్తయినట్లు వైద్యాధికారులు నేడు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 0-5 ఏళ్లున్న చిన్నారులకు రెండు చుక్కల పోలియో డ్రాప్స్ వేసినంతరం ఎడమచేతి చిటికెల వేలుకు చుక్క పెడతారు. దీనికి కారణమేంటంటే..మరొక కేంద్రానికి వెళ్లకుండా, పోలియో చుక్కలు దుర్వినియోగం కాకుండా ఈ విధానం కొనసాగిస్తున్నారు. గతంలో సిరా పెట్టేవారు. ప్రస్తుతం పర్మినెంట్ మార్కర్ పెన్ వాడుతున్నారు.