News February 7, 2026

క్యూఆర్ కోడ్‌తో భూవివరాలు సులభతరం: కలెక్టర్

image

పట్టాదారు పాసుపుస్తకాల్లోని క్యూఆర్ కోడ్ ద్వారా భూమి, యజమాని వివరాలను సులభంగా తెలుసుకోవచ్చని కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. శుక్రవారం కుర్నూతల గ్రామం వెంకట్ రాజు గారి పల్లెలో నిర్వహించిన పాసుపుస్తకాల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. రీసర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, పుస్తకాల్లో పొరపాట్లు ఉంటే వెంటనే సరిచేయాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News February 15, 2026

తాయిలాల పర్వం.. వారికి భారీగా డబ్బు, కార్లు, ఫ్లాట్లు

image

TG: మున్సిపల్ ఎన్నికలు ముగిసినా డబ్బు, హామీల ప్రవాహం ఆగట్లేదు. 37 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లలో హంగ్ పరిస్థితి ఉంది. రేపు ఎన్నిక ఉండటంతో మున్సిపల్ ఛైర్‌పర్సర్, వైస్ ఛైర్‌పర్సన్, మేయర్, డి.మేయర్ రేసులో ఉన్నవారు స్వతంత్రుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇప్పటికే వారికి HYDలో ఫ్లాట్లు, ఖరీదైన కార్లు, భారీగా డబ్బు, బంగారు బహుమతులు అందించినట్లు సమాచారం. మరికొందరికి కాంట్రాక్టు పనుల హామీలు ఇచ్చారట.

News February 15, 2026

కొండాపురం: 108 వాహనంలో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

image

కొండాపురం మండలం వెంకయ్యకాలువ గ్రామానికి చెందిన గర్భిణి 108 వాహనంలోనే ఆదివారం సాయంత్రం బిడ్డను ప్రసవించింది. గ్రామానికి చెందిన ప్రత్యూష పురుటి నొప్పులు రావడంతో 108 వాహనంలో కొండాపురం ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు చేపట్టారు. మార్గమధ్యలో నొప్పులు అధికం కావడంతో 108 వాహన EMT సునీత పురుడు పోశారు. దీంతో ప్రత్యూష ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ క్షేమంగానే ఉన్నట్లు సునీత తెలిపారు.

News February 15, 2026

తిరుపతి: రైలు నుంచి కింద పడి వ్యక్తి దుర్మరణం

image

నందలూరు–హస్తవరం రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం గుర్తించినట్లు రేణిగుంట GRP పోలీసులు తెలిపారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా, రైలు నుంచి జారిపడటంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. మృతుడు మెరూన్ స్వెటర్, బూడిద చొక్కా, లుంగీ ధరించి ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.