News March 11, 2025

క్యూట్.. Pic Of The Day

image

కదిరిలో శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి నారా లోకేశ్ ఓ చిన్నారిని ఎత్తుకుని ఆడించారు. పర్యటన ముగించుకుని వెళ్తున్న క్రమంలో తన కాన్వాయ్ వద్దకు అభిమానులు చిన్నారిని తీసుకొచ్చారు. ఆయన చిన్నారిని ఎత్తుకుని ముద్దాడారు. ఇందుకు సంబంధించిన క్యూట్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిక్ ఆఫ్ ది డే అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

Similar News

News July 9, 2025

కర్నూలు మాజీ ఎంపీకి గోల్డ్ మెడల్

image

కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్‌కు గవర్నర్ అబ్దుల్ నజీర్ గోల్డ్ మెడల్ బుధవారం విజయవాడలో అందజేశారు. 17వ పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన సమయంలో జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీకి చేసిన సేవలకు గాను ఈ మెడల్ అందజేసి, సన్మానించారు. గవర్నర్‌తో పాటు రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులకు ఎంపీ ధన్యవాదాలు తెలిపారు.

News July 9, 2025

KNR: లోకల్ ఎన్నికలు.. ఆ పార్టీలు తగ్గేదేలే..!

image

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ప్రధాన పార్టీల నేతలు దూకుడు పెంచారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలను మచ్చిక చేసుకుంటున్నారు. కాగా నిన్న కాంగ్రెస్ ఉమ్మడి KNR జిల్లా ఇన్‌ఛార్జ్‌గా అద్దంకి దయాకర్‌ను అధిష్ఠానం నియమించగా పార్టీ బలోపేతంపై ఆయన ఫోకస్ చేయనున్నారు. మరోవైపు KTR ఆదేశాలతో ఇప్పటికే BRS నేతలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. BJP సైతం గట్టి పోటీనిచ్చేందుకు వ్యూహాలను రచిస్తోంది.

News July 9, 2025

మూడో టెస్టుకు టీమ్ ప్రకటన.. స్టార్ పేసర్ రీఎంట్రీ

image

భారత్‌‌తో రేపటి నుంచి జరగనున్న మూడో టెస్టుకు ఇంగ్లండ్ ఒక్క మార్పుతో జట్టును ప్రకటించింది. జోష్ టంగ్ ప్లేస్‌లో స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ నాలుగేళ్ల తర్వాత కమ్‌బ్యాక్ ఇస్తున్నారు. దీంతో ENG బౌలింగ్ అటాక్ స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. లార్డ్స్‌లో గ్రీన్ పిచ్‌ ఉండనుందన్న వార్తల నేపథ్యంలో ఆర్చర్ కీలకంగా మారనున్నారు.
ENG: క్రాలే, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్, స్మిత్, వోక్స్, కార్స్, ఆర్చర్, బషీర్