News April 15, 2024

క్యూ ఆర్ కోడ్ రిలీజ్ చేసిన భద్రాద్రి జిల్లా ఎస్పీ

image

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో ట్రాఫిక్ రూట్, పార్కింగ్ స్థలాలు, తలంబ్రాలు, లడ్డూ ప్రసాదం స్టాల్స్, కల్యాణ మండపం యొక్క సెక్టార్ ప్లాన్ కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ క్యూఆర్ కోడ్ లో పూర్తి సమాచారం లభిస్తుందని తెలిపారు.

Similar News

News February 1, 2026

KMM: కాంగ్రెస్ విజయానికి సైనికుల్లా పని చేయాలి: మంత్రి కొండా సురేఖ

image

మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. ఆదివారం ఏదులాపురంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నప్పుడు పదవుల కోసం పోటీ సహజమని, అయితే వార్డుకు ఒకే అభ్యర్థి ఉండేలా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే ఆయుధాలుగా ప్రతి ఇంటి గడప తట్టి, కాంగ్రెస్ విజయానికి సైనికుల్లా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

News February 1, 2026

KMM: ఇసుక అక్రమ హవా.. నిమ్మకు నీరెత్తని యంత్రాంగం!

image

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గమైన మధిరలో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. చిన్నమండవ, తిమ్మినేనిపాలెం మున్నేరు వాగు నుంచి వందలాది ట్రాక్టర్లతో ఇసుక ఖమ్మం నగరానికి తరలిపోతోంది. ఇందిరమ్మ ఇళ్ల కూపన్ల ముసుగులో చెక్ పోస్టుల నుంచే ఈ రవాణా సాగుతుండటం గమనార్హం. అధికారులు పట్టించుకోకపోవడం వెనుక రాజకీయ నేతల హస్తం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

News February 1, 2026

KMM: దోపిడీ కేసు.. ముగ్గురికి ఐదేళ్ల జైలు శిక్ష

image

ఫేస్‌బుక్ మిత్రుడిపై దాడి చేసి కారు, ఐఫోన్ దోచుకున్న కేసులో ఖమ్మం జిల్లా బోనకల్‌కు చెందిన నరేష్, షేక్ అహ్మద్, వేణులకు కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 2020లో విజయవాడలోని ఓ లాడ్జిలో ఫణీంద్ర అనే వ్యక్తిని కొట్టి వాహనం ఎత్తుకెళ్లినందుకు గవర్నర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.10,500 జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.