News October 6, 2025

క్రమం తప్పకుండా తరగతులకు రావాలి: ADB DIEO

image

దసరా సెలవులు ముగిశాయని.. ఇంటర్ జూనియర్ కళాశాలలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభమవుతున్నట్లు ఆదిలాబాద్ DIEO జాధవ్ గణేశ్ కుమార్ పేర్కొన్నారు. విద్యార్థులు తరగతులకు క్రమం తప్పకుండా హాజరుకావాలని సూచించారు. ముఖ గుర్తింపు (Face Recognition) సిస్టమ్ ద్వారా హాజరు నమోదు చేస్తామన్నారు. ఈ హాజరును అంతర్గత, ప్రాక్టికల్ IPE 2026 థియరీ పరీక్షలలో పరిగణలోకి తీసుకుంటామన్నారు.

Similar News

News October 5, 2025

ADB: కారు జోరు.. చేరికలతో గెలుస్తుందా పోరు

image

స్థానిక సంస్థల ఎన్నికలపై కారు పార్టీ జోరు పెంచింది. ఆదిలాబాద్ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ప్రచారం వేగవంతం చేసింది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి జోగు రామన్న పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. బోథ్‌లో MLA అనిల్ జాదవ్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలు వివరిస్తూ చేరికలపై దృష్టిసారించారు. ప్రత్యర్థి పార్టీల్లోని మెజార్టీ లీడర్లను చేర్చుకునేలా ముందుకెళ్తున్నారు.

News October 5, 2025

ఆదిలాబాద్: సోమవారం ప్రజావాణి రద్దు

image

గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. రానున్న రెండో ఆర్డినరీ గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు సభ్యుల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి అమలులో ఉందన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నాటి ప్రజావాణి రద్దు చేశామని ప్రజలు ఎవరు కలెక్టరేట్‌కు రాకుడదని సూచించారు.

News October 4, 2025

ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ సన్నాహక సమావేశం

image

ఎన్నికల్లో అన్ని స్థానాల‌ను కాంగ్రెస్ పార్టీ కైవ‌సం చేసుకుంటుద‌ని అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ కంది శ్రీ‌నివాస రెడ్డి ధీమా వ్య‌క్తం చేసారు. శ‌నివారం ఆయన క్యాంపు కార్యాల‌యంలో ముఖ్య‌నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో విడివిడిగా స‌మావేశ‌మ‌య్యారు. బేల, భోర‌జ్, జైన‌థ్ మండ‌ల నాయ‌కులతో భేటీ అయ్యి ప‌లు అంశాల‌పై చర్చించారు. పోటీకి సిద్ధంగా ఉండే ఆశావ‌హులు, వారి బ‌లాబ‌లాల‌పై సమీక్షించారు.