News February 13, 2025
క్రమం తప్పకుండా విజిలెన్స్ కమిటీ సమావేశాలు నిర్వహించాలి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739449582577_18976434-normal-WIFI.webp)
క్రమం తప్పకుండా విజిలెన్స్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గురువారం జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలాల్లో మధ్యాహ్న భోజన నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. ఫుడ్ సేఫ్టీ కమిటీ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు తనిఖీలు చేపట్టాలన్నారు.
Similar News
News February 13, 2025
సికింద్రాబాద్.. ఈ భవనాలు ఇక కనిపించవు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739459175969_81-normal-WIFI.webp)
సికింద్రాబాద్ అనగానే ఠక్కున గుర్తొచ్చే భవనాలు ఇవి. ఎన్నో ఏళ్లుగా ప్రయాణికుల గుండెల్లో, సినిమాల్లో కనిపించిన ఈ రైల్వే స్టేషన్ భవనాలు పూర్తిగా కనుమరుగు కానున్నాయి. ఎన్నో ప్రయాణాలకు సాక్ష్యంగా నిలిచిన ఈ భవనాలను అధికారులు నేలమట్టం చేస్తున్నారు. స్టేషన్ అభివృద్ధిలో భాగంగా వీటి స్థానంలో ₹700crతో ఎయిర్‌పోర్టులా నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో పాత భవనాలను గుర్తు చేసుకుంటూ ప్రయాణికులు ఎమోషనల్ అవుతున్నారు.
News February 13, 2025
కల్తీ నెయ్యి కేసులో నిందితులకు పోలీస్ కస్టడీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739460235669_81-normal-WIFI.webp)
AP: తిరుమల కల్తీ నెయ్యి కేసులో నలుగురు నిందితులను పోలీస్ కస్టడీకి తిరుపతి రెండో అదనపు మున్సిఫ్ కోర్టు అనుమతిచ్చింది. నిందితులు శ్రీవైష్ణవి డెయిరీ డైరెక్టర్లు వివేక్ జైన్, పోమిల్ జైన్, ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్, అపూర్వ చావ్డాలను ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ కేసులో నలుగురు నిందితులను ఆదివారం అరెస్ట్ చేసిన సిట్ అధికారులు అదేరోజు కోర్టులో హాజరుపరిచారు.
News February 13, 2025
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని తనిఖీ చేసిన జనగామ కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739444221482_51924886-normal-WIFI.webp)
జనగామ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని గురువారం కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా సదరం క్యాంప్ నిర్వహణ తీరును పరిశీలించారు. డాక్టర్లు, రోగులతో మాట్లాడారు. రోగులను క్రమ పద్ధతిలో వారికి కేటాయించిన సీట్లలోనే కూర్చోబెట్టి పిలవాలని సదరం నిర్వాహకులకు చెప్పారు. చర్మ వ్యాధి సోకిన సంవత్సరంన్నర పాప శంకరపల్లి రన్వితను కలెక్టర్ పలకరించారు.