News December 29, 2024
క్రికెటర్ నితీశ్ తల్లిది మన ప్రకాశం జిల్లానే.!
ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్‌లో తెలుగు తేజం నితీశ్ కుమార్ సెంచరీ (189 బంతుల్లో 114)తో దుమ్ములేపిన సంగతి తెలిసిందే. కాగా నితీశ్ తల్లి జోత్స్న ప్రకాశం జిల్లా వాసులే కావడం గమనార్హం. ఆమె ఒంగోలు మండలంలోని చెరువుకొమ్మాలెం గ్రామానికి చెందిన వారు. అలాగే నితీశ్ కుటుంబీకులు మేనమామలు, తాతయ్య, అమ్మమ్మలు జిల్లాలోనే ఉంటారు. అంతర్జాతీయ స్థాయిలో నితీశ్ ప్రతిభ చాటడంతో ఆ గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 1, 2025
పర్చూరు నియోజకవర్గానికి వైసీపీ ఇన్‌ఛార్జ్ మార్పు
పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా గాదె మధుసూదన రెడ్డి నియమితులయ్యారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గాదె మధుసూదన రెడ్డి మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కుమారుడు. ప్రస్తుతం పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా యడం బాలాజీ ఉన్న విషయం తెలిసిందే.
News December 31, 2024
న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న బాపట్ల కలెక్టర్
విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి విద్యార్థులకు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాలలో నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులతో మమేకమై కేక్ కట్ చేసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులతో కలిసి వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు.
News December 31, 2024
కులగణనపై అభ్యంతరాలను స్వీకరిస్తాం: బాపట్ల కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జనవరి 7వ తేదీ వరకు షెడ్యూల్డ్ కులగణనపై సామాజిక తనిఖీ నిర్వహించి, అభ్యంతరాలను స్వీకరిస్తామని బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. షెడ్యూల్డ్ కులాల కులగణన వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించామని తెలిపారు. దీనిపై వచ్చే అభ్యంతరాలను వచ్చే జనవరి 11 వరకూ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామన్నారు. తుది వివరాలను వచ్చే నెల 17న సచివాలయాల్లో ప్రదర్శిస్తామన్నారు.