News December 2, 2025

క్రికెట్‌లో సంగారెడ్డి జట్టు విజయం

image

బేపీఆర్ సింగపూర్ మైదానంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం అంతర్ జిల్లాల క్రికెట్ అండర్ 14 పోటీలు నిర్వహించారు. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సిద్దిపేట పింక్ జట్టు 89 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సంగారెడ్డి ఏ జట్టు 90 పరుగులు చేసి విజయం సాధించిందని జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రాజేందర్ రెడ్డి తెలిపారు.

Similar News

News December 5, 2025

నేడు నర్సంపేటకు సీఎం.. షెడ్యూల్ ఇదే..!

image

నేడు నర్సంపేటకు సీఎం రేవంత్‌ రానున్న విషయం తెలిసిందే. నియోజకవర్గంలో రూ.531 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మెడికల్ కళాశాల సమీపంలో శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 1:15 గం.కు బేగంపేట నుంచి హెలీకాప్టర్‌లో బయల్దేరి, 2 గంటలకు నర్సంపేట హెలీప్యాడ్ చేరుకుంటారు. మ.2:15 నుంచి 3:55 వరకు కార్యక్రమాల్లో పాల్గొని, 4 గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు.

News December 5, 2025

ప.గోలో 13.25 లక్షల కుటుంబాలకు తాగునీరందించేలా ప్రాజెక్ట్

image

జిల్లాలో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు రూ.1,400 కోట్లతో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం తెలిపారు. 16 మండలాల పరిధిలోని 862 గ్రామాల్లోని 13.25 లక్షల కుటుంబాలకు తాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. దీని కోసం 2,662 కిలోమీటర్ల మేర పైపులైన్ వేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

News December 5, 2025

టీటీడీ డబ్బుల్లోనూ కమీషన్ల కోసం కక్కుర్తి: వైఎస్ జగన్

image

TTD డబ్బుల్లో 10 శాతానికి మించి ప్రైవేట్‌ బ్యాంకుల్లో జమ చేయకూడదని మాజీ సీఎం జగన్ అన్నారు. ‘CBN హయాంలో కమీషన్లకు కక్కుర్తిపడి రూ.1,300 కోట్లు ఎస్‌ బ్యాంక్‌లో పెట్టించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ డబ్బును విత్‌ డ్రా చేసి జాతీయ బ్యాంకులో పెట్టింది. ఆ తర్వాత 3 నెలలకు ఎస్‌ బ్యాంక్‌ ఆర్థికంగా కుదేలయ్యింది. ఆ రూ.1,300 కోట్లు ఎస్‌ బ్యాంక్‌లోనే ఉంటే ఆ డబ్బు ఏమయ్యేది? మరి ఏది స్కామ్‌?’ అని ప్రశ్నించారు.