News January 3, 2025
క్రికెట్ జట్టుకు హైదరాబాద్ కుర్రాడు
HYDకు చెందిన మరో క్రికెటర్ సత్తా చాటుతున్నాడు. ఎల్బీనగర్ వాసి రాపోల్ సాయి సంతోష్ దేశవాళీ 2024-25 సీజన్‌లో అరుణాచల్ ప్రదేశ్ అండర్-23 క్రికెట్ టీమ్‌కు ఎంపికయ్యాడు. BCCI మెన్స్ అండర్-23 స్టేట్-ఏ ట్రోఫీ కోసం జరగనున్న పోటీలకు అరుణాచల్ ప్రదేశ్ జట్టు తరఫున ఆడనున్నాడు. 21 ఏళ్ల సంతోష్ జట్టులో ఆల్ రౌండర్‌గా రాణిస్తున్నాడు. గతంలో జాతీయ స్థాయి అండర్-16,17 గేమ్స్‌లో తెలంగాణ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.
Similar News
News January 5, 2025
HYD: రైతుద్రోహి సీఎం: కేటీఆర్
మాజీమంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై Xలో మండిపడ్డారు. అక్కరకు రాని ఇందిరమ్మ భరోసా, రైతు భరోసాలో ప్రభుత్వం రైతునే కాంగ్రెస్ మాయం చేసిందన్నారు. మొక్కిన ఒక్క పథకం ఇయ్యని కాంగ్రెస్.. మోసానికి మారు పేరని పేర్కొన్నారు. ఢోకాలకు కేరాఫ్ కాంగ్రెస్ సర్కార్ అని రైతుద్రోహి సీఎం రేవంత్ అని రాసుకొచ్చారు.
News January 5, 2025
నేడు ఓయూలో బీసీ విద్యార్థుల భారీ బహిరంగ సభ
ఓయు ఆర్ట్స్ కాలేజ్ వద్ద బీసీ విద్యార్థుల బహిరంగ సభను ఆదివారం సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తున్నట్లు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ తెలిపారు. సంక్షేమ హాస్టల్స్‌కు సొంత భవనాలు నిర్మించాలని, పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ముఖ్యఅతిథిగా పాల్గొంటారని తెలిపారు.
News January 5, 2025
ప్రతి ఒక్కరిలో భగవంతుడున్నాడు: గవర్నర్
ప్రతి ఒక్కరిలో భగవంతుడున్నాడని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. పీయూఎన్ వర్మ, అమరవాణి ఫౌండర్ డాక్టర్ మదన్ మహరాజ్ గోసావి ఆధ్వర్యంలో రాజభవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన భాగ్యనగర్ భారతీయ సంస్కృతి సమ్మేళన్ కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సనతాన ధర్మం అంటే ఎప్పటికప్పుడు తమలోని విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ కాలంతో పాటు ధర్మాన్ని ఆచరించడమేనని అన్నారు.