News January 2, 2026
క్రికెట్ టోర్నమెంట్‌కు కెప్టెన్ దీపికకు ఆహ్వానం

మడకశిర మండలం నీలకంఠాపురంలో గురువారం భారత బ్లైండ్ క్రికెట్ కెప్టెన్ దీపిక అభినందన సభ నిర్వహించారు. ఈ సభలో అగళి ప్రీమియర్ లీగ్ (APL) నిర్వాహకులు గోవిందరాజు, రవి కెప్టెన్ దీపికను కలిసి ఈ సంక్రాంతికి అగళిలో నిర్వహించనున్న APL సీజన్-3 క్రికెట్ టోర్నమెంట్‌కు ఆహ్వానించారు. అనంతరం దీపికకు పుష్పగుచ్ఛం, అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News January 5, 2026
NLG: టెట్ అభ్యర్థులకు తప్పని తిప్పలు

టెట్ అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల కేటాయింపు ఇబ్బందిగా మారింది. మొదటి రోజే అప్లై చేసినా, ప్రాధాన్యత క్రమంలోని చివరి పట్టణాల్లో కేంద్రాలు కేటాయించడంతో అభ్యర్థులు వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో ఒక రోజు ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు. జిల్లా నుంచి 1,557 మంది ఉపాధ్యాయులతో సహా సుమారు 3 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 4న ప్రారంభమైన పరీక్షలు 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
News January 5, 2026
వరంగల్: తక్కువకు అమ్మితే రూ.5 లక్షల జరిమానా

WGLలో లిక్కర్ మార్టులు సిండికేట్‌గా మారిపోయాయి. వైన్స్ షాపుల కంటే MRPలపై తక్కువ ధరలకు లిక్కర్ మార్టుల్లో అమ్మేవాళ్లు. ప్రస్తుతం కొత్త టెండర్ల ద్వారా షాపులను దక్కించుకున్న మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారిపోయారు. ఓ అధికార పార్టీ నేత అండదండలతో సిండికేట్ ఏర్పాటు చేశారు. తలా రూ.5లక్షలను లిక్కర్ మార్ట్ యజమానులు డిపాజిట్ చేశారు.ఎవరైనా తక్కువ ధరలకు విక్రయిస్తే ఆ రూ.5లక్షలను జప్తు చేయాలని డిసైడ్ అయ్యారట.
News January 5, 2026
తండ్రైన క్రికెటర్ అంబటి రాయుడు

తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు తండ్రయ్యారు. ఆయన భార్య విద్య మగ పిల్లాడికి జన్మనిచ్చారు. వారిద్దరితో దిగిన సెల్ఫీ ఫొటోను రాయుడు ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. కాగా విద్యను రాయుడు 2009లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన పలు లీగుల్లో ఆడుతూ క్రికెట్ కామెంటరీ కూడా చేస్తున్నారు.


