News January 2, 2026

క్రికెట్ టోర్నమెంట్‌కు కెప్టెన్ దీపికకు ఆహ్వానం

image

మడకశిర మండలం నీలకంఠాపురంలో గురువారం భారత బ్లైండ్ క్రికెట్ కెప్టెన్ దీపిక అభినందన సభ నిర్వహించారు. ఈ సభలో అగళి ప్రీమియర్ లీగ్ (APL) నిర్వాహకులు గోవిందరాజు, రవి కెప్టెన్ దీపికను కలిసి ఈ సంక్రాంతికి అగళిలో నిర్వహించనున్న APL సీజన్-3 క్రికెట్ టోర్నమెంట్‌కు ఆహ్వానించారు. అనంతరం దీపికకు పుష్పగుచ్ఛం, అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News January 3, 2026

మురుగు నగరానిది.. కన్నీరు నల్గొండది..!

image

హైదరాబాద్‌ మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలతో మూసీ నది కాలుష్య కాసారంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాలుష్యం చివరగా నల్గొండ జిల్లాకు చేరుతుండటంతో అక్కడ పుట్టే పిల్లలు అంగవైకల్యంతో పుడుతుంటే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతమని, నల్గొండ ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళన చేస్తానన్న ప్రభుత్వ నిర్ణయంపై మీ కామెంట్.

News January 3, 2026

నెల్లూరు జిల్లాలో 19 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

నెల్లూరు జిల్లాలోని KGBVలో 19 బోధనేతర పోస్టులను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య ఓ ప్రకటనలో కోరారు. శనివారం నుంచి 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. అభ్యర్థులు తమ అప్లికేషన్లను నెల్లూరులోని సమగ్రశిక్ష కార్యాలయంలో అందజేయాలని కోరారు.

News January 3, 2026

14,582పోస్టులు.. టైర్- 2 ఎగ్జామ్స్ తేదీల ప్రకటన

image

కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్(CGL)-2025 టైర్ 2 పరీక్ష తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<>SSC<<>>) ప్రకటించింది. జనవరి 18న స్కిల్ టెస్ట్, జనవరి 19న మ్యాథమెటికల్ ఎబిలిటీస్ అండ్ రీజనింగ్& జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్&కాంప్రహెన్షన్ అండ్ జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్, స్టాటిస్టిక్స్ పరీక్ష నిర్వహించనుంది. ఈ పరీక్ష ద్వారా 14,582 పోస్టులను భర్తీ చేయనుంది.