News February 9, 2025
క్రికెట్ టోర్నమెంట్‌లో సూర్యాపేట స్ట్రైకర్స్ విజయం

ఎస్బీఐ ఇంట్రారీజియన్ ఆధ్వర్యంలో సూర్యాపేటలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌ను ఎస్బీఐ రీజినల్ మేనేజర్ వై. ఉపేంద్ర భాస్కర్ శనివారం ప్రారంభించారు. ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బ్యాంకింగ్ బ్లాస్టర్స్ 100 పరుగులు చేయగా, సూర్యాపేట స్ట్రైకర్స్ బ్యాట్స్‌మెన్ ఏఎన్ఆర్ చివరి మూడు బంతుల్లో 13 పరుగులు చేసి 101 పరుగులతో సూర్యాపేట స్ట్రైకర్స్ జట్టును విజేతగా నిలిపారు.
Similar News
News December 14, 2025
ఉగ్రవాదాన్ని సహించబోం.. సిడ్నీ అటాక్‌పై మోదీ

ఆస్ట్రేలియాలోని సిడ్నీ బీచ్‌లో జరిగిన <<18561798>>కాల్పుల<<>>పై ప్రధాని మోదీ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని భారత్ సహించబోదని మరోసారి స్పష్టం చేశారు. టెర్రరిజంపై చేసే పోరాటానికి మద్దతు ఇస్తుందని తెలిపారు. కాగా కాల్పుల్లో ఇప్పటిదాకా 12 మంది చనిపోయారు. ఓ దుండగుడు హతమవ్వగా, పట్టుబడిన వ్యక్తి నవీద్ అక్రమ్‌గా గుర్తించారు.
News December 14, 2025
టాస్‌తో వరించిన విజయం.. అడవి లింగాల సర్పంచ్‌గా మంగలి సంతోష్

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని అడవిలింగాల గ్రామ సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసిన మంగలి సంతోశ్ కుమార్, పెంట మానయ్యాకు 483 ఓట్లు సమానంగా వచ్చాయి. టాస్ వేయడంతో మంగలి సంతోష్ కుమార్ గెలుపొందినట్లుగా అధికారులు ప్రకటించారు. దీంతో గ్రామస్థులు ప్రజలు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.
News December 14, 2025
రాయికోడ్: 4 ఓట్లతో WIN

రాయికోడ్ మండలంలో ఎన్కెపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సర్పంచ్‌గా BRS బలపరిచిని అభ్యర్థి బేగరి ఈశ్వరమ్మ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి మానమ్మా మీద 4 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఫలితాలు వెలువడగానే పార్టీ అనుచరులు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు.


