News January 27, 2026

క్రికెట్ ఫ్యాన్స్‌ అలర్ట్: వైజాగ్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఇవే..

image

విశాఖలో భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ సందర్భంగా రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ట్రాఫిక్ మళ్లింపులు అమల్లోకి రానున్నాయి. స్టేడియం చుట్టూ 11 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం వైపు వాహనాలను ఆనందపురం, పెందుర్తి మీదుగా మళ్లిస్తున్నారు. నగరం నుంచి వెళ్లే వాహనాలు హనుమంతవాక, అడవివరం మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు. ప్రేక్షకులు నిర్ణీత పార్కింగ్ ప్రదేశాల్లోనే వాహనాలు నిలపాలన్నారు.

Similar News

News February 5, 2026

విశాఖ: చెత్త కుప్పలో బాంబు అంటూ పరుగులు..

image

విశాఖలోని తాటిచెట్లపాలెంలో అర్ధరాత్రి బాంబు కలకలం రేపింది. చెత్తకుప్పలో ఉన్న స్కూల్ బ్యాగ్‌లో లైటింగ్ బ్లింక్ కావడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఐఎఫ్ఆర్‌ నేపథ్యంలో అక్కడికి వెళ్లిన పోలీసులు వేంటనే 112కి కాల్ చేసి అప్రమత్తం చేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ అక్కడికి వెళ్లి పరిశీలించగా పిల్లలు ఆడుకునే బొమ్మ అని నిర్ధారణ అయింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

News February 5, 2026

‘విశాఖ స్టీల్‌పై కేంద్ర దృక్పథం మారింది’

image

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌‌పై కేంద్ర ప్రభుత్వ దృక్పథం అనుకూలంగా ఉందని స్టీల్‌ సెక్రటరీ సందీప్‌ పౌండ్రిక్‌ తెలిపారు. అధికారులు, కార్మికులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. RINLకి ఇంకా దేశవ్యాప్తంగా బ్రాండ్‌ విలువ ఉందన్నారు. రుణాల వడ్డీ 14% – 8.9% తగ్గిందని, ఉత్పత్తి ఖర్చులు మరింత తగ్గించే అవకాశం ఉందన్నారు. 2 నెలల్లో ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కరిస్తామని CMD మణీష్‌ రాజ్‌ గుప్తా పేర్కొన్నారు.

News February 5, 2026

విశాఖలో బార్లకు నేడే లక్కీ డ్రా

image

విశాఖలో 27 బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి లాటరీని నేడు VMRDA చిల్డ్రన్స్ ఏరినాలో నిర్వహించనున్నారు. 52 బార్లకు నోటిఫికేషన్ విడుదల చేయగా 108 దరఖాస్తులు వచ్చాయి. ఒక బారు లైసెన్స్‌కు 4 దరఖాస్తులు వచ్చినపుడే లక్కీ డ్రా నిర్వహిస్తారు. 27 మద్యం బార్లకు మాత్రమే 4 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా రూ.22 కోట్లు ఆదాయం లభించిందని ఎక్సైజ్‌ శాఖ సూపరింటెండెంట్ ఆర్.ప్రసాద్ తెలిపారు.