News March 22, 2025

క్రికెట్ బెట్టింగులకు దూరంగా ఉండండి: బాపట్ల ఎస్పీ

image

యువత బెట్టింగులకు దూరంగా ఉండాలని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఈరోజు నుంచి ప్రారంభమవుతున్న ఐపీఎల్ మ్యాచ్లను ఆసరాగా తీసుకొని క్రికెట్ బెట్టింగులకు తెరలేపే అవకాశం ఉందని అన్నారు. యువత బెట్టింగుల వైపు వెళ్లకుండా చదువుపై దృష్టి సాధించాలని అన్నారు.

Similar News

News March 23, 2025

ఆ సామర్థ్యం భారత్ సొంతం: జైశంకర్

image

ఇంధన శక్తి విషయంలో భారత్ విభిన్న విస్తృతమైన బంధాల్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ అభిప్రాయపడ్డారు. ‘మనది ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. మన అవసరాలకు తగిన విధంగా బంధాలుండాలి. ఏకకాలంలో అటు రష్యా ఇటు ఉక్రెయిన్‌తో, అటు ఇజ్రాయెల్ ఇటు ఇరాన్‌తో, అటు పశ్చిమ దేశాలు ఇటు దక్షిణార్ధ దేశాలతో, అటు బ్రిక్స్ ఇటు క్వాడ్‌తో చర్చలు జరపగల సామర్థ్యం మన సొంతం’ అని పేర్కొన్నారు.

News March 23, 2025

ఆర్మీలో దరఖాస్తులు ఆహ్వానం.. చివరి తేదీ ఏప్రిల్ 10

image

ఇండియన్ ఆర్మీలో వివిధ క్యాటగిరీలో నియామకానికి ఇండియన్ ఆర్మీ దరఖాస్తులు స్వీకరిస్తోంది. జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, అగ్నివీర్, స్టోర్ కీపర్ పోస్టుల భర్తీ కోసం టెన్త్, ఇంటర్ పాసైన అభ్యర్థులు ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. NCC అర్హత పొందిన అభ్యర్థులకు బోనస్ మార్కులు ఉంటారని తెలిపారు. పూర్తి సలహాల కోసం రిక్రూట్మెంట్ కార్యాలయం కోసం 040- 27740205 సంప్రదించాలన్నారు.

News March 23, 2025

BRS హయాంలో తెలంగాణ అప్పులపాలు: బండి సంజయ్

image

TG: బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. దీనికి కేసీఆర్ మూర్ఖత్వమే కారణమని ఆయన విమర్శించారు. ‘ప్రస్తుతం రాష్ట్రానికి రూ.6 లక్షల కోట్ల అప్పులు ఉన్నట్లు సీఎం రేవంత్ చెబుతున్నారు. హామీలు ఇచ్చినప్పుడు అప్పులు ఉన్నట్లు తెలియదా? అధికారంలోకి వచ్చాక ఏం చేద్దామనుకున్నారు? అప్పులు తీర్చేందుకు ప్రభుత్వం భూములు అమ్మే పరిస్థితికి దిగజారింది’ అని ఆయన మండిపడ్డారు.

error: Content is protected !!