News March 24, 2025
క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు: బాపట్ల ఎస్పీ

క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ హెచ్చరించారు. వారిపై రౌడీ షీట్స్ తెరవడానికి కూడా వెనుకాడబోమన్నారు. జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తే ఉపేక్షించబోమని, వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సోమవారం జిల్లా ఎస్పీ హెచ్చరించారు. బెట్టింగ్ సమస్యల గురించి విద్యార్థులకు, యువతకు విస్తృత అవగాహన కల్పించవలసిన అవసరం ఉందన్నారు.
Similar News
News November 13, 2025
Way2News ఎఫెక్ట్.. రూ.4.5 కోట్ల స్కాంపై ఎంక్వయిరీ

కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలో రూ.4.5కోట్ల స్కాం అంటూ <<18192226>>Way2Newsలో కథనం<<>> ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన తెలంగాణ వైద్య విధాన పరిషత్ విచారణ చేపట్టింది. నేడు హాస్పిటల్ చేరుకున్న విచారణ అధికారులు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ విభాగాల్లో క్షేత్రస్థాయిలో నిషితంగా ఆడిట్ నిర్వహిస్తున్నారు. నిధుల దుర్వినియోగం, బిల్స్, రిసిప్ట్‌లపై సంబంధిత సిబ్బందిని ప్రశ్నిస్తూ వివరాలు సేకరిస్తున్నారు.
News November 13, 2025
ఆ ఆలోచన కూడా రాకుండా శిక్షిస్తాం: అమిత్ షా

ఢిల్లీ పేలుడు నిందితులకు విధించే శిక్ష ప్రపంచానికి బలమైన సందేశం పంపుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. మరోసారి అలాంటి అటాక్ చేయాలనే ఆలోచన కూడా రాకుండా శిక్షిస్తామన్నారు. ‘నిందితులపై తీసుకునే చర్యలతో భారత్ ఏ రూపంలోనైనా ఉగ్రవాదాన్ని సహించదని నిరూపిస్తాం. మెసేజ్ క్లియర్.. మనకు హాని కలిగించాలని ప్రయత్నించే వారు ఎవరైనా కఠిన పరిణామాలను ఎదుర్కొంటారు’ అని ఆయన హెచ్చరించారు.
News November 13, 2025
వనపర్తి: ఈనెల 23న పాలమూరులో బీసీల రణభేరి

బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 23న పాలమూరులో బీసీల రణభేరి బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఛైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ మీడియా సమావేశంలో తెలిపారు. అయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చాలని, బీసీ మహిళలకు సబ్‌కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీల హక్కుల పరిరక్షణ కోసం ఈ రణభేరి చరిత్రాత్మక పోరాటానికి నాంది కానుందని తెలిపారు.


