News March 23, 2025

క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడితే చర్యలు: అన్నమయ్య SP

image

క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఎస్పీ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఐపీఎల్ నేటి నుంచి ప్రారంభమైన నేపథ్యంలో మ్యాచ్‌ను చూసి ఆనందించాలన్నారు. అంతకు మించి బెట్టింగులకు పాల్పడి, జీవితాలను నాశనం చేసుకొని ఆత్మహత్యలు చేసుకోవద్దని హెచ్చరించారు. ఎవరైనా క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని  ఎస్పీ కోరారు.

Similar News

News September 17, 2025

రోజూ గంట నడిస్తే.. ఇన్ని లాభాలా?

image

నడక వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. రోజులో గంటసేపు నడిస్తే శరీరంలో జరిగే మార్పుల గురించి వివరించారు. *రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. *ఒత్తిడి తగ్గుతుంది. *మానసిక స్థితి మెరుగవుతుంది.
*రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలోకి వస్తాయి. *పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. *మనసు ప్రశాంతంగా ఉంటుంది. *డోపమైన్ (హ్యాపీ హార్మోన్) పెరుగుతుంది. అందుకే నడవడం మొదలుపెట్టండి. SHARE IT

News September 17, 2025

తెలంగాణ విమోచన వేడుకల్లో రాజ్ నాథ్ సింగ్

image

TG: హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఇవాళ బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై.. జాతీయ జెండాను ఎగుర వేస్తారు. ఆయన నిన్న సాయంత్రమే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. గతేడాది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

News September 17, 2025

ASF: గంజాయి సాగు.. పదేళ్ల జైలు శిక్ష

image

గంజాయి సాగు చేసిన నిందితుడికి ASF జిల్లా కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. వాంకిడి ఎస్ఐ మహేందర్ తెలిపిన వివరాలు.. వాంకిడి మండలం సోనాపూర్‌కి చెందిన జంగు 2022లో అక్రమంగా గంజాయి మొక్కలను సాగు చేస్తూ పోలీసులకు చిక్కాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని రిమాండ్‌కు తరలించారు. మంగళవారం జిల్లా కోర్టులో నేరం రుజువు కావడంతో జిల్లా జడ్జి రమేశ్ జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు తెలిపారు.