News April 18, 2025

క్రికెట్ బెట్టింగ్ కేసులో సింగరాయకొండ వాసి అరెస్ట్

image

క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో సింగరాయకొండకు చెందిన వైసీపీ నేత వెంకట్రావు గురువారం అరెస్టయ్యారు. బెట్టింగ్‌లో ఓడిపోయిన కడప వాసి సతీశ్ కుమార్ వెంకట్రావుకు రూ. 2 లక్షలు ఇవ్వాల్సి ఉంది. ఆ నగదు కోసం వేధిస్తున్నాడని సతీశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏపీ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచినట్లు ఎస్సై మహేంద్ర తెలిపారు. నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించి నెల్లూరు జైలుకు తరలించారు. 

Similar News

News April 19, 2025

రేపు జిల్లాకు రానున్న ఎంపీ మాగుంట

image

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకాశం జిల్లాలో ఆదివారం పర్యటించనున్నారు. ఈ మేరకు మాగుంట కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించనున్న సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల్లో ఎంపీ పాల్గొంటారు. 21వ తేదీన సాయంత్రం మార్కాపురంలోని చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరవుతారు.

News April 19, 2025

సంతనూతలపాడు MLA టికెట్ పేరుతో మోసం

image

ఎమ్మెల్యే టికెట్ పేరుతో ప్రకాశం జిల్లాలో మోసం జరిగింది. తనకు కాంగ్రెస్ పార్టీ సంతనూతలపాడు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామంటూ అదే పార్టీకి చెందిన నాగలక్ష్మి, ఆమె భర్త సతీశ్ రూ.10 లక్షలు తీసుకున్నారని సుబ్బారావు ఆరోపించారు. నగదు తీసుకుని తనను మోసం చేశారని ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదైంది.

News April 19, 2025

ప్రకాశం: వీరిద్దరే దొంగలు.. జాగ్రత్త

image

ఇటీవల ప్రకాశం జిల్లాలో దొంగతనాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో తాళ్లూరు పోలీసులు శుక్రవారం ఇద్దరు దొంగల ఫోటోలను రిలీజ్ చేశారు. తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్‌గా వీళ్లు దొంగతనాలు చేస్తున్నారు. అనాథాశ్రమానికి సహాయం చేయండంటూ ముందుగా మహిళ తాళాలు వేసిన ఇళ్లను గమనిస్తుంది. ఆ తర్వాత మరో వ్యక్తికి సమాచారం అందిస్తే అతను దొంగతనం చేస్తాడు. వీరితో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

error: Content is protected !!